1638 కోట్లను మట్టిపాలు చేసిన చంద్రబాబు, దేవినేని?

Update: 2020-07-10 11:51 GMT
నాటి టీడీపీ ప్రభుత్వంలో 1638 కోట్లు ఖర్చు పెట్టి ఘనంగా కట్టారు. పురుషోత్తమ పట్నం ప్రాజెక్టుతో నీళ్లు పారించారు. మాజీ సీఎం చంద్రబాబు, మాజీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ తమ ఘనతగా చెప్పుకున్నారు. కానీ తీరా అందులోని బొక్కలు చూస్తే.. అసలు ఈ ఎత్తిపోతలకు కేంద్రం అనుమతియే తీసుకోలేదు. ఇప్పుడు ఆ పథకం ఎటూ కాకుండా పోయింది. చంద్రబాబు దేవినేని ఉమల నిర్లక్ష్యానికి ఈ పురోషత్తమపట్నం ప్రాజెక్టు ఇప్పుడు నిరుపయోగంగా మారిందని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. 1638 కోట్లు బూడిదలో పోసినట్టైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

టీడీపీ పరిపాలన ఎంత దారుణంగా.. ప్రణాళిక లేకుండా సాగిందో ‘పురుషోత్తమపట్నం’ ఎత్తిపోతలతో బయటపడిందని వైసీపీ సర్కార్ విచారణలో తేల్చిందట.. టీడీపీ అధికారంలో ఉన్నపుడు నాటి సీఎం చంద్రబాబు నాయుడు, అప్పటి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ రూ.1638కోట్లతో పురుషోత్తం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ద్వారా తూర్పుగోదావరి జిల్లాలోని రైతులకు సాగునీరు, విశాఖ, పోలవరం ప్రాజెక్టు ఎడమ కాల్వ వెంట ఉండే గ్రామాలకు తాగునీరు అందించాలని ప్లాన్ చేశారు. ఈ ఎత్తిపోతల పథకాన్ని రెండు దశల్లో నిర్మించేందుకు ముందుకొచ్చింది. 2017ఆగస్టు 15న తొలిదశను చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. 2017-18 ఖరీఫ్ సీజన్లో లో 1.95 టిఎంసీల నీటిని పంపింగ్ చేశారు.

కాగా రెండో దశ పనులను మాత్రం గతేడాది ఏప్రిల్ ఒకటో తేదీన చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ రెండు దశల పనులకు గాను ప్రభుత్వం 1638 కోట్లు ఖర్చు చేసింది. అదంతా బాగానే ఉన్నా ఎప్పుడైతే జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిందో నాటి నుంచి ప్రాజెక్టును అడ్డుకోవడమే పనిగా టీడీపీ పని చేస్తోంది. జగన్ చేపట్టే పనుల్లో అడ్డుపుల్ల వేస్తూ ఆ నెపాన్ని వైసీపీ సర్కార్ పై మోపాలని కుట్రలు పన్నుతోంది. ఈ ప్రాజెక్టు భూసేకరణకు చెల్లించే నష్టపరిహారం చెల్లదంటూ టీడీపీ నేత జమ్ముల చౌదరయ్య కోర్టును ఆశ్రయించడం ఇందులో భాగమేనని తెలుస్తోంది.

అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టులో భాగమైన పురుషోత్తమపట్నానికి పర్యావరణ అనుమతులు లేవని చంద్రబాబు హయాంలోనే కొందరు రైతులు గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. ప్రాజెక్టు కోసం తమ భూములు గుంజుకున్నారని కొందరు రైతులు గ్రీన్ ట్రిబ్యునల్ లో పేర్కొన్నారు. తాజాగా టీడీపీ నేత సైతం ఆశ్రయించాడు. దీంతో గ్రీన్ ట్రిబ్యునల్ తమ ఆదేశాలు వచ్చేంతవరకు పురుషోత్తపట్నం ఎత్తిపోత నుంచి నీటిని తరలించొద్దని ఉత్తర్వులు ఇచ్చింది. సాగునీటి కోసం కేంద్ర జలసంఘం నుంచి అనుమతులు తీసుకోవాలని పేర్కొంది. అప్పటి వరకు నీరు తరలించుకుండా స్టే విధించడంతో రైతులకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. టీడీపీ చేసిన ఈ నిర్వాకంపై స్థానిక రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసున్నారు.

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన ఈ ప్రాజెక్టు ఎందుకు అనుమతులు తీసుకోలేదని స్థానిక రైతులు, ప్రజాప్రతినిధులు ఇప్పుడు చంద్రబాబును నిలదీస్తున్నారు. అనుమతులు లేకుండా ప్రాజెక్టును చేపట్టడం దోచుకోవడానికా? అని ప్రశ్నిస్తున్నారు. 1638 కోట్ల ప్రజాధనం వృథా కావడానికి నాటి సీఎం చంద్రబాబు, మంత్రి దేవినేని చేసిన ఘనకార్యాలే కారణమని ఆరోపిస్తున్నారు. కమీషన్ల కోసం కట్టిన ప్రాజెక్టు ఇదీ అంటూ మండిపడుతున్నారు.
Tags:    

Similar News