మ్యాచ్ మధ్యలో ఆ అమ్మాయి వద్దకు రఫెల్ వెళ్లారెందుకు?

Update: 2020-01-24 10:49 GMT
టెన్నిస్ లో బంతి ఎంత వేగంగా దూసుకెళుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి.. అలాంటిది ఒక భారీ షాట్ గురి తప్పి దూసుకెళ్లి.. ఎవరినైనా తాకితే? అది కూడా టీనేజ్ అమ్మాయిని అయితే? సరిగ్గా అలాంటి అనుభవమే ఎదురైంది స్టార్ క్రీడాకారుడు స్పెయిన్ స్టార్ రఫెల్ నాదల్. ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నీ ఆడుతున్న అతను.. తాను కొట్టిన ఒక షాట్ కు తీవ్ర భయానికి గురయ్యారు.

ప్రత్యర్థి తన వైపు పంపిన బంతిని బలంగా కొట్టగా.. అది కాస్త దిశను మార్చుకొని అంపైర్ వెనుక నిలబడిన ఒక అమ్మాయికి తగిలింది. దీంతో.. మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులు ఓమైగాడ్ అన్నట్లుగా గట్టిగా అరిచేశారు. వారి అరుపులతో రపెల్ సైతం అదురుపాటుకు గురయ్యాడు. వెంటనే.. ఆ అమ్మాయి వైపు చూశారు. అయితే.. ఆ అమ్మాయి మాత్రం కళ్లతో తనకేం కాలేదని సైగ చేసింది.

అయితే.. ఆ అమ్మాయి సంకేతాన్ని చూసి ఊరుకోకుండా.. ఆట ఆపి మరీ.. ఆమె దగ్గరకు వెళ్లాడు. ఆమెను సమీపించి ఏం కాలేదుగా? అని అడిగాడు. అంతేకాదు.. ఆ బాలిక టోపీ పక్కకు జరిపి.. దెబ్బ తగిలిందేమోనని చూసి.. చెంపకు అప్యాయంగా ముద్దు పెట్టి.. తల నిమిరి ఆటలోకి వెళ్లాడు.

తన కారణంగా టీనేజర్ ఏమైనా ఇబ్బంది పడిందేమోనంటూ రఫేల్ పడిన ఆవేదన స్టేడియంలోని ప్రేక్షకుల్నే కాదు.. మ్యాచ్ చూసిన వారిని కదిలించింది.ఈ మ్యాచ్ అయిన తర్వాత  రఫెల్ రియాక్ట్ అవుతూ.. ఆమె గురించి తనకు చాలా భయమేసిందని.. బంతి ఆమె తలకు నేరుగా తగిలినా గాయం కానందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఆమె చాలా తెలివైన అమ్మాయి అని కితాబునిచ్చారు. రఫేల్ లాంటి స్టార్ ఆటగాడు చేసిన పనికి ప్రేక్షకులు.. క్రీడాభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. పలువురు తమ కళ్లను తాము నమ్మలేకపోతున్నట్లుగా వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

వీడియో కోసం క్లిక్ చేయండి
Tags:    

Similar News