టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఎంతో హుందాగా ఉండే మనిషిగా పేరుతెచ్చుకున్నారు. క్రికెటర్ గా ఉన్నా.. బయట కూడా ఎంతో పద్ధతిగా ప్రవర్తిస్తుంటాడు. నిజాయితీ, నిక్కచ్చి మనిషిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన మాటతీరు, ప్రవర్తన అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది.
పాకిస్తాన్ తో ఈరోజు మ్యాచ్ కు ముందు నిర్వహించే ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఓ సరదా ఘటన అందరినీ నవ్వులు పూయించింది. 'సెక్సీ' అనే పదం నోటిదాకా వచ్చినా.. పలకకుండా ద్రావిడ్ నియంత్రించుకొని విలేకర్ల ముందు తటపటాయించాడు. ఆ వీడియో వైరల్ గా మారింది.
శనివారం రాత్రి ద్రవిడ్ విలేకర్లతో మాట్లాడారు. కొందరు విలేకర్లు ద్రవిడ్ ను 'పాక్ బౌలింగ్ పై ' ప్రశ్నించారు. దీనికి ద్రావిడ్ సమాధానమిస్తూ.. పాక్ బౌలర్లు బాగా బౌలింగ్ చేస్తున్నారు. నేను దానిని కాదనను.. కానీ మా కుర్రాళ్లు కూడా వారిని 147 పరుగులకే కట్టడి చేశారు. కొన్ని సార్లు అంకెల్లో ఒకరు గంటకు 145 కిలోమీటర్ల వేగంతో బంతులేశారని.. అంటున్నారు. కానీ ఎంత బాగా బౌలింగ్ చేసినా ఫలితాలే ముఖ్యం. మేం గ్లామర్ గా కనిపించకపోవచ్చని.. కానీ ఫలితాలు సాధించే కుర్రాళ్లు మా వద్ద ఉన్నారు' అని పాక్ బౌలింగ్ కంటే తాము తీసిపోమని మీడియా ఎదుట ద్రావిడ్ వాదించారు.
ఈ క్రమంలోనే బౌలింగ్ దళం గురించి చెబుతూ 'సెక్సీ' అనే పదం వాడకుండా మింగేశారు. ఆ పదం ఏంటని ఓ విలేకరి ప్రశ్నించగా.. 'ఎస్ తో మొదలై నాలుగు అక్షరాల పదం' (సెక్సీ) అని దాన్ని పలకడం ఇష్టం లేదని.. అలాంటి పదాలు తాను వాడనంటూ నవ్వుతూ కవర్ చేశాడు.
మొత్తంగా తన భాషలోనూ బూతు పదం వాడకుండా ద్రావిడ్ పరిణతిగా ఆలోచించారని.. ఇంతటి పద్ధతిగల మనిషి లేరంటూ ఆ వీడియోను షేర్ చేస్తూ నెటిజన్లు కొనియాడుతున్నారు.
కాగా ఈరోజు సూపర్ 4లో భాగంగా భారత్-పాక్ లు తలపడుతున్నాయి. ఇప్పటికే ఈ టోర్నీలో భారత్ ఒకసారి పాక్ ను ఓడించింది. అదే సమయంలో టీమిండియాకు రవీంద్ర జడేజా గాయం కారణంగా దూరమయ్యాడు. అక్షర్ పటేల్ ఎంట్రీ ఇచ్చాడు. ఈరోజు మ్యాచ్ ఎలా జరుగుతుందన్నది వేచిచూడాలి.