జ‌గ‌న్ అప్డేట్ రాహుల్ ఎలా మిస్ అయ్యారు?

Update: 2017-06-05 09:25 GMT
ప్ర‌త్యేక హోదా మీద ఈ రోజు ఏపీలో ఎవ‌రైనా మాట్లాడుతున్నారంటే అదొక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మాత్ర‌మే. విభ‌జ‌న త‌ర్వాత నుంచి నేటి వ‌ర‌కూ రెగ్యుల‌ర్ గా హోదా సాధ‌న మీద నిర‌స‌న‌లు.. పోరాటాలు చేస్తున్నది జ‌గ‌నే. హోదా కోసం మ‌ధ్య‌లో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ గ‌ళం విప్పినా.. త‌ర్వాతి కాలంలో ఆయ‌నీ విష‌యం మీద మౌనంగా ఉండ‌టాన్ని మ‌ర్చిపోకూడ‌దు.

మ‌రి.. అలాంటి జ‌గ‌న్ ను హోదా మీద పోరాటం చేయ‌డం లేదంటూ ఏఐసీసీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ విమ‌ర్శించ‌టం.. హోదా సాధ‌న‌కు తూట్లు పొడిచిన ఏపీ సీఎం చంద్ర‌బాబుతో జ‌త క‌ల‌ప‌టం చూస్తే.. కాంగ్రెస్ యువ‌రాజు ఎక్క‌డో త‌ప్పులో కాలేసిన‌ట్లుగా క‌నిపించ‌క మాన‌దు.

ఏపీ మీద రాహుల్ అవ‌గాహ‌న లేమి నిన్న‌టి గుంటూరు స‌భ‌లో స్ప‌ష్టంగా క‌నిపించింద‌న్న విమ‌ర్శ వినిపిస్తోంది. ఏపీలో రెగ్యుల‌ర్ గా ఏం జ‌రుగుతుంది? అన్నింటికి మించి హోదా మీద ఎవ‌రేం చేస్తున్నారు? ఎలాంటి వాద‌న‌లు వినిపిస్తున్నారు? లాంటి ప్ర‌శ్న‌ల‌కు స‌మాచారం లేద‌న్న భావ‌న రాహుల్ మాట‌ల్ని విన్న‌ప్పుడు అర్థ‌మ‌వుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అంతేకాదు..ఫీడ్ బ్యాక్ కోసం నియ‌మించుకున్న వ్య‌క్తులు రాహుల్‌ కు స‌రైన స‌మాచారాన్ని ఇవ్వ‌టం లేదా? అన్న సందేహం క‌లిగేలా ఆయ‌న మాటలు ఉన్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

నిజానికి.. హోదా విష‌యం మీద రాహుల్ కానీ క‌మిట్ మెంట్ తో ఉంటే.. ఆ అంశం మీద పోరాడుతున్న జ‌గ‌న్ తీరును ప్రశంసించాల్సి ఉంది. కానీ.. అలాంటిదేమీ చేయ‌కుండా హోదా అంశాన్ని పూర్తిగా నీళ్ల‌కు వ‌దిలేసిన చంద్రబాబుతో జ‌త క‌ల‌ప‌టం ఆయ‌న అప‌రిప‌క‌త్వకు నిద‌ర్శంగా చెప్పొచ్చు. హోదా మీద పోరాడుతున్న వారి గురించి ప్ర‌జ‌ల్లో ఉన్న భావ‌న‌కు భిన్నంగా మాట్లాడితే.. రాహుల్‌ కు మ‌రింత న‌ష్టం వాటిల్లుతుంద‌న్న విష‌యాన్ని ఆయ‌న గుర్తిస్తే మంచిద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News