సంవత్సరంలో 364 రోజులు విమర్శలు.. వ్యంగ్యాస్త్రాలు.. ఆరోపణలు చేయటం మామూలే. కాకుంటే.. ఈ మధ్యన నేతలు తమ రాజకీయ ప్రత్యర్థుల బర్త్ డే రోజున మాత్రం విషెస్ చెబుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఈ తరహా కల్చర్ ను స్టార్ట్ చేసింది ప్రధాని మోడీనేనని చెప్పాలి. తాను ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత స్వపక్షంతో పాటు.. విపక్ష నేతల పుట్టిన రోజు సందర్భంగా విషెస్ చెప్పే విధానాన్ని షురూ చేశారు. ఇందుకు సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా విషెస్ ట్వీట్ చేయటం మొదలెట్టారు.
ఇప్పుడు మోడీ విధానాన్ని అందరూ పాటిస్తున్నారు.ఈ రోజు ప్రధాని మోడీ పుట్టినరోజు. ఈ నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఒక ట్వీట్ చేసి.. మోడీకి బర్త్ డే విషెస్ చెప్పారు. కాకుంటే.. ఆయన ట్వీట్ లో మన ప్రధాని అని పేర్కొనటం ఆసక్తికరంగా మారింది.
మన ప్రధాని నరేంద్రమోడీకి జన్మదిన శుభాకాంక్షలు.. ఆయన ఎప్పుడై ఆయురారోగ్యాలతో వర్దిల్లాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు. మోడీకి బర్త్ డే విషెస్ చెప్పిన రాహుల్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. మోడీ పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు ఉదయం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్.. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్..యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్.. హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖత్తార్ సహా పలువురు ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉంటే.. ఈసారి తన బర్త్ డే వేడుకల్ని మోడీ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గంలో జరుపుకోవటం గమనార్హం. ఎన్నికలు ముంచుకొచ్చిన వేళ.. మోడీ లాంటి మహా మేధావికి ఆ మాత్రం ముందుచూపు లేకుండా ఉంటుందా?