ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా వెలుగొందుతూ అందరినీ అదిలించాలనుకునే దేశం అమెరికా.. కానీ, అలాంటి అమెరికా ప్రజలనే బెదిరించి కోట్లు కొట్టేస్తుస్తోంది ముంబయికి చెందిన పెద్ద ముఠా. అది కూడా మామూలుగా కాదు, ఏకంగా కాల్ సెంటర్ల ఉద్యోగుల ద్వారా ఇక్కడి నుంచే బెదిరింపు కాల్సు చేసి సింపులుగా తమ అకౌంట్లలో డబ్బులు పడేలా చేసుకుంటోంది. అమెరికాలో నమోదైన ఫిర్యాదుల ఆధారంగా అక్కడి పోలీసులు ఇచ్చిన సమాచారంతో ముంబయి క్రైం బ్రాంచి పోలీసులు ఏకంగా 500 మంది ఒకేసారి అరెస్టు చేశారు. అయితే.. వారంతా ఇలా బెదిరింపు కాల్సు చేసే కాల్ సెంటర్ ఉద్యోగులు. అసలు ఈ ప్లాను వెనుక ఎవరున్నారు... ఇలాంటి నెట్ వర్కులు ఇంకా ఏవైనా ఉన్నాయా అన్నది తేలాల్సి ఉంది. ఇది ముఠాల పనా.. లేదంటే కాల్ సెంటర్ ఉద్యోగుల్లో పాకిన ట్రెండా అన్నది కూడా దర్యాప్తు చేస్తున్నారు.
ముంబైలోని కాల్ సెంటర్లలో పనిచేస్తూ - అమెరికన్లను బెదిరిస్తున్నారన్న కేసులో 500 మంది ఉద్యోగులను క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం సంచలనం కలిగించింది. మీరా రోడ్ ప్రాంతంలోని కాల్ సెంటర్లపై 200 మంది పోలీసులు దాడులు గత రాత్రి నుంచి తెల్లవారుఝాము వరకూ దాడులు చేసి వీరిని అరెస్ట్ చేశారు. తమను తాము అమెరికా ఆదాయపు పన్ను శాఖ అధికారులుగా చెప్పుకుంటూ - వీరు అమెరికన్లకు ఫోన్లు చేసి - బ్యాంకు ఖాతాల వివరాలు, ఆర్థిక లావాదేవీలు చెప్పాలని బెదిరిస్తున్నారని, తాము చెప్పిన ఖాతాల్లో డబ్బు వేయాలని డిమాండ్ చేస్తున్నారట.
పలువురు అమెరికన్లు తాము బెదిరింపులకు గురవుతున్నామని ఫిర్యాదు చేయగా, అమెరికా పోలీసులు ఇచ్చిన సమాచారంతో ఈ దాడులు చేశారు. ఈ కాల్ సెంటర్ల ఉద్యోగుల వలలో పడే అమెరికా పన్ను ఎగవేతదారులు - బడాబాబుల నుంచి రోజుకు కోటి రూపాయల వరకూ ఉద్యోగుల ఖాతాల్లోకి వస్తోందట. కొద్దికాలం కిందట ఫిర్యాదు అందుకుని అప్పటి నుంచి ఈ కార్యకలాపాలపై కన్నేసిన ముంబై పోలీసులు గత రాత్రి ఒక్కసారిగా దాడులు చేశారు. ఇది భారీ కుంభకోణం అంటున్న పోలీసులు అనేక అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. మిగతా సిటీల్లోని కాల్ సెంటర్లలోనూ ఇలాంటి వ్యవహారం ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మొత్తానికి కాల్ సెంటర్ ఉద్యోగులు ఐటీవాళ్లమని చెప్పి ఇంతకాలం అమెరికన్లతో ఆడుకున్నారన్న మాట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/