ఎమ్మెల్యేగా రజినీకాంత్ దర్శకుడు

Update: 2021-03-02 13:30 GMT
సూపర్ స్టార్ రజినీకాంత్ తో వరుసగా ‘కబాలి’, కాలా అనే చిత్రాలు తీసిన దర్శకుడు పా రంజిత్ రాజకీయాల్లోకి ప్రవేశించనున్నారు. రానున్న కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో శాసనసభ్యుడిగా పోటీచేయడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

పా రంజిత్ కమ్యూనిజం భావాలు గల దర్శకుడు. ఆయన సినిమాల్లోనూ అదే చూపిస్తుంటారు. అంబేద్కరిజం, దళితవాదాన్ని ప్రస్తావిస్తుంటారు. ఈ క్రమంలోనే రాబోయే కేరళ ఎన్నికల్లో ఆయనకు సీపీఎం టికెట్ ఇస్తామని హామీ ఇచ్చిందని.. ఆయన పోటీకి రెడీ అయ్యారని తెలిసింది.

పా రంజిత్ తమిళంలో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ‘ఆటకత్తి’తో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత రజినీకాంత్ ఇతడికి పిలిచి చాన్స్ ఇచ్చాడు. వరుసగా రెండు సినిమాలు తీశాడు.

మద్రాస్, కబాలి, కాలా చిత్రాలను రంజిత్ రూపొందించారు. సర్పట్టా పరంబరై చిత్రం ప్రస్తుతం తీస్తున్నాడు. నిర్మాతగానూ పలు సినిమాలు తీశాడు. ప్రస్తుతం రాజకీయ అరంగేట్రం చేస్తున్నాడు.
Tags:    

Similar News