రజినీ వ‌ర్సెస్ జ‌య‌...ఓ ఆస‌క్తిక‌ర‌మైన ఎపిసోడ్‌

Update: 2016-12-06 06:54 GMT
త‌మిళ రాజ‌కీయాల‌ను శాసించే పురిచ్చిత‌లైవి జ‌య‌ల‌లిత, వ‌ర్సెస్  ఎన్నిక‌ల‌ను ప్ర‌భావితం చేసే త‌లైవా ర‌జినీకాంత్ కు మ‌ధ్య పొర‌పొచ్చాలు వ‌స్తే ప‌రిస్థితి ఎలా ఉంటుంది? అస‌లే విప‌రీత‌మైన అభిమానానికి పెట్టింది పేర‌యిన త‌మిళ‌నాడులో అభిమానులు ఎలా వ్య‌వ‌హ‌రిస్తారో తెలిసిందే. అలా ఒక‌ద‌శ‌లో రజినీ త‌న‌దైన శైలిలో అమ్మ‌కు ఝ‌లక్ ఇచ్చాడు. అయితే...ఆ త‌ర్వాత ప‌రిస్థితిలో మార్పు వ‌చ్చేసింది.

చెన్నైకి చెందిన గాయ‌త్రీ శ్రీ‌కాంత అనే వైద్యురాలు రాసిన పుస్త‌కంలో ఇలాంటి ఉదాహ‌ర‌ణే ఒక‌టి ఉంది. ర‌జినీకాంత్ చెన్నైలో ప్ర‌యాణిస్తుండ‌గా పోలీసులు ట్రాఫిక్ నిలిపివేశారు. ఈ ట్రాఫిక్ లో రజినీ కాంత్ సైతం చిక్కుకున్నాడు. అక్క‌డే ఉన్న ట్రాఫిక్ వారిని అడిగితే సీఎం వ‌స్తున్నందుకు ఆపివేశామ‌ని చెప్ప‌గా ఎప్పుడు వ‌స్తార‌ని ర‌జినీ ప్ర‌శ్నించారు. ఎప్పుడు అనేది తాము చెప్ప‌లేమ‌ని, అయితే ట్రాఫిక్ నిలిపివేయ‌డం మాత్రం ఖాయ‌మ‌ని చెప్ప‌డంతో షాక్ తిన‌డం ర‌జినీ వంతు అయింది. దీంతో త‌న‌దైన స్టైల్ ర‌జినీ రియాక్ష‌న్ చూపించాడు. కారు దిగి ద‌గ్గ‌ర్లో ఉన్న ఓ పాన్ షాప్ వ‌ద్ద సిగ‌రేట్ తాగారు. అస‌లే ర‌జినీ, పైగా త‌మిళ‌నాడు దీంతో పెద్ద సంఖ్య‌లో జ‌నం, అభిమానులు పోగు అయ్యారు. ఈ ట్రాపిక్ లో సీఎం జ‌య‌లలిత చిక్కుకుపోయారు!

ఇలాగే 1996 ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌య‌ల‌లిత గురించి చెప్తూ జ‌య‌లలిత అధికారంలోకి వ‌స్తే రాష్ట్రాన్ని ఎవ‌రూ కాపాడ‌లేరు అంటూ బ‌హిరంగ ప్ర‌క‌ట‌న చేశారు. రజినీ కాంత్ చేసిన‌ ఒక్క కామెంటే ప్ర‌తిప‌క్షాల‌న్నీ వాడుకున్నాయంటే ప‌రిస్థితి అర్థం చేసుకోవ‌చ్చు. అయితే అనంత‌రం ప‌రిస్థితుల్లో మార్పు వ‌చ్చింది. 2011 ఎన్నిక‌ల సంద‌ర్భంగా జ‌య‌ల‌లిత విజ‌యం త‌మిళ‌నాడును కాపాడింది అని ర‌జినీ ప్ర‌క‌టించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News