ఎర్ర గంగిరెడ్డి వ్యాఖ్యలకు స్పందించిన రంగయ్య

Update: 2021-07-24 12:42 GMT
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కీలక మలుపు తిరుగుతోంది.వైఎస్ వివేకా హత్య కేసులో ఆయన ఇంటి వాచ్ మెన్ రంగన్న కీలకంగా వాంగ్మూలం ఇచ్చాడు.  పులివెందులలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ఇంటి వద్ద భడవాండ్ల రంగన్న అలియాస్ రంగయ్య (65) కాపలాదారుడిగా ఉంటున్నాడు.వైఎస్ వివేకా హత్య జరిగిన 2019 మార్చి 15న ఆయనే ఆ ఇంటి కాపలదారుగా ఉన్నాడు.

శుక్రవారం వాచ్ మెన్ రంగన్నను సీబీఐ అధికారులు విచారించారు. వివేకా ఇంటి వాచ్ మెన్ రంగయ్య ఇచ్చిన సమాచారంతో కేసుకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వైఎస్ వివేకా హత్య కోసం ఇద్దరు వ్యక్తులు రూ.8 కోట్లు సుపారీ ఇచ్చినట్లుగా రంగయ్య జమ్మలమడుగు మెజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. ఇప్పుడు ఈ వాంగ్మూలం కీలకంగా మారబోతోందని తెలుస్తోంది.

ఇక వైఎస్ వివేకా హత్యలో పాత్రధారిగా ఎర్ర గంగారెడ్డి పేరును వాచ్ మెన్ రంగన్న చెప్పినట్టుగా మీడియాలో ప్రచారం అవుతోంది.  వివేకా హత్య జరిగిన రోజు అక్కడే ఉన్న ఎర్ర గంగిరెడ్డి ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించినట్లు రంగన్న వాంగ్మూలంలో చెప్పారని వార్తలువచ్చాయి.  

ఈ ఆరోపణలపై తాజాగా ఎర్ర గంగారెడ్డి స్పందించారు. ఈ ఆరోపణలను ఖండించారు. 'రంగన్న ఎవరో తెలియదని.. తాను ఎందుకు బెదిరిస్తానని గంగారెడ్డి' పేర్కొన్నారు.  రంగన్నతో తనకు పెద్దగా పరిచయం లేదన్నారు. రంగన్న నిన్న మద్యం మత్తులో మాట్లాడారని ఎర్ర గంగిరెడ్డి ఆరోపించారు. వివేకాను ఎదురించే ధైర్యమే తనకు లేదని.. అలాంటి ఆయన హత్య కేసులో తన ప్రమేయం ఉందని రంగన్న చెప్పడం దారుణమని గంగిరెడ్డి పేర్కొన్నారు.

వివేకా బావమరిది ఫోన్ చేసి మీ సారు చనిపోయారని తనకు చెప్పారని గంగిరెడ్డి తెలిపారు. వివేకా కూతురు నుంచి వివరాలు తెలిసాయని.. హత్యతో అసలు తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన సన్నిహితుడు గంగిరెడ్డి తెలిపారు. బెంగళూరు స్థల వివాదం వివేకా చనిపోయాక రెండు నెలల ముందే పరిష్కారమైందని గంగిరెడ్డి తెలిపారు. వివేకా అనుచరుడు అయిన నేతు ఆ హత్య జరిగిన రోజు రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చానని గంగిరెడ్డి తెలిపారు. ఉదయం లేటుగా నిద్ర లేచానని వెల్లడించారు. వివేకా బావమరిది ఫోన్ చేస్తేనే ఆయన చనిపోయిన విషయం తెలిసిందన్నారు.

తాజాగా ఎర్ర గంగన్న ఆరోపణలపై రంగన్న మీడియాతో మాట్లాడారు. 'వివేకా హత్యకు ముందు అర్ధరాత్రి ఎవరో కొందరు ఇంట్లోకి వచ్చారని రంగన్న తెలిపారు. వాళ్లు ఎవరో తనకు తెలియదన్నారు. 'ఎర్ర గంగిరెడ్డి వివేకాతోనే ఉంటారు. నాతో ఎన్ని సార్లు మాట్లాడారు. ఇప్పుడు నేనెవరో తెలియదంటే ఏమనుకోవాలి' అని రంగన్న ప్రశ్నించారు. తనకేమీ కాదని అంటేనే సీబీఐకి అన్ని విషయాలు చెప్పానన్నారు.
Tags:    

Similar News