టాటా సన్స్ చైర్మన్ గా సైరస్ మిస్త్రీని తొలగించిన తరువాత కొత్త చైర్మన్ ఎంపిక పనిలో తలమునకలై ఉన్న రతన్ టాటా బృందం సంస్థను నాలుగు నెలల్లో చక్కదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం గతంలో సంస్థలో పనిచేసి రిటైరైన కొందరు దిగ్గజాలను మళ్లీ పిలవనున్నట్లు సమాచారం. ఇందుకు వీలుగా రిటైర్మెంటు వయసు 80 ఏళ్లకు పెంచబోతున్నట్లు పారిశ్రామికవర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
రతన్ టాటా కూడా 78 ఏళ్ల వయసులో ఉండడంతో ఆయన కూడా మళ్లీ టాటా గ్రూపులోకి ఎంటరవాలంటే రిటైర్మెంటు వయసు పెంచాల్సి ఉంటుంది. అందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకుంటారని టాక్. టాటా ఇండస్ర్టీస్ మాజీ ఎండీ కిశోర్ చౌకార్, తో పాటు హేమంత్ నెరూకార్ - ప్రకాశ్ తెలంగ్ వంటివారిని మళ్లీ తీసుకొచ్చి సంస్థను గాడిలో పెట్టేందుకు టాటా పూనుకున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు మార్గదర్శకాల్లోనూ మార్పులు చేస్తున్నారని తెలుస్తోంది. టాటా సన్స్ కు చైర్మన్ గా ఉన్న వ్యక్తి గ్రూప్ కంపెనీల్లోని బోర్డు డైరెక్టర్ల అధిపతిగా ఉండాల్సిన అవసరం లేదన్నది కొత్త మార్గదర్శకాల్లో ఒకటి. ఇక చైర్మన్ నిర్వర్తించే విధులను ఇద్దరు లేదా ముగ్గురికి పంచడం ద్వారా, కంపెనీలో 'అధికార కేంద్రం' అన్న మాట వినిపించకుండా చూడాలని కూడా టాటా సన్స్ పెద్దలు భావిస్తున్నారు. తమ తమ రంగాల్లో నిష్ణాతులైన వ్యక్తులనే కంపెనీలకు చైర్మన్లుగా నియమించడం ద్వారా జేఆర్డీ టాటా సంస్థను నడిపిన నాటి రోజులను మరోసారి గుర్తుకు తేవాలని రతన్ టాటా భావిస్తున్నట్టు టాటా సన్స్ వర్గాలు వెల్లడించాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/