రావెల కిషోర్‌బాబు రాద్దాంతం వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కామెంట్ చేసి రెండు గంటలైందే లేదో వెంటనే మళ్లీ రావెల పవన్‌కు కౌంటర్ ఇచ్చేశారు. రైతులు స్వచ్ఛందంగా భూములు ఇవ్వకపోతే ధర్నా చేస్తానంటున్న పవన్ ఈ విషయంలో అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారని రావెల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు మంచి చేయాలన్న ఉద్దేశం పవన్ కు ఉంటే వారికి నచ్చచెప్పి రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చేలా ఒప్పించాలని రావెల అన్నారు. రైతులు భూములు ఇవ్వకుండా పవన్ అడ్డుకోవడం సరికాదని..ఒకవేళ రైతులు భూమి ఇవ్వకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ ఆయన హెచ్చరించారు.
పవన్ గతంలో చేసిన ట్వీట్లపై రావెల స్పందిస్తూ పవన్ అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారంటూ విమర్శించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 98 శాతం భూసేకరణ పూర్తయినందున ..ఆఫ్ర్టాల్ 3 వేల ఎకరాల కోసం పవన్ రాద్దాంతం ఎందుకని రావెల అన్నారు. ఈ వ్యాఖ్యలపై పవన్ మాట్లాడుతూ టీడీపీ ఎంపీ మురళీమోహన్ అవుటర్ రింగురోడ్డులో చాలా తక్కువ మొత్తంలోనే భూములు కోల్పోతేనే సుప్రీంకోర్టు వరకు వెళ్లారని..ఇక్కడ పొలాలపై ఆధారపడి జీవించే రైతుల గురించి రావెల ఆఫ్ర్టాల్ ..ఆఫ్ర్టాల్ అనడం తగదని పవన్ విరుచుకుపడ్డారు.