సీమ లో ఆనందం నింపిన జగన్

Update: 2019-12-18 06:02 GMT
కర్నూలు ను జ్యూడిషియల్ రాజధాని గా ప్రతిపాదిస్తూ ఏపీ సీఎం జగన్ నిన్న అసెంబ్లీ లో చేసిన ప్రకటన తో రాయలసీమ లో ఆనందం వెల్లివిరిసింది. జగన్ కు జనం నీరాజనాలు పలుకుతున్నారు.

తాజాగా కర్నూలులో ప్రజలు, న్యాయవాదులు రోడ్ల మీదకు వచ్చి టపాసులు కాలుస్తూ జగన్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేస్తున్నారు. మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు.  హైకోర్టు కోసం 97 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న న్యాయవాదులుకు సీఎం జగన్ ప్రకటన ఊరటనిచ్చింది.

గతంలో ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిని కోల్పోయిన కర్నూలులో జ్యూడీషియల్ రాజధాని ఏర్పాటు అంశం సీమకు జరిగిన నష్టాన్ని నివారించినట్లేనని  అక్కడి వాసులు అభిప్రాయపడుతున్నారు. వెనుకబడిన జిల్లాలను అభివృద్ధి చేయడానికి సీఎం నిర్ణయం దోహదపడుతుందన్నారు.

అమరావతిని ఏకైక రాజధానిగా కాదన్న జగన్ నిర్ణయంపై ప్రతిపక్ష టీడీపీ, ఇతర నేతలు వ్యతిరేకిస్తున్నా రాయలసీమ, ఉత్తరాంధ్రలోని ప్రజలు, నాయకులు, వివిధ వర్గాలు మాత్రం స్వాగతిస్తూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తుండడం విశేషం.
Tags:    

Similar News