ఇవాళా నిన్నా కాదు, ఎన్టీయార్ నుంచి కూడా రాయలసీమ నందమూరి వారికి అలా కలసివస్తోంది. అక్కడ పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఆ ఫ్యామిలీకి ఉన్నారు. దివంగత వైఎస్సార్ ఎన్టీయార్ సినిమాలు ఎక్కువగా చూసేవారని చెబుతారు. ఇక జగన్ అయితే బాలయ్య సినిమాలు ఇష్టపడతారు అని ప్రచారంలో ఉంది. ఒక విధంగా నందమూరి వంశం అంటే సీమలో అదో రకమైన అనురానం ఉంది.
ఎన్టీయార్ రాయలసీమ క్షామ పరిస్థితుల మీద 1950లలో జోలె పట్టుకుని ఊరూరా విరాళాల కొరకు తిరిగారు. అప్పట్లో జిల్లా స్థాయి నాయకుడిగా ఉన్న కోట్ల విజయభాస్కరరెడ్డి నేస్తం అయ్యారు. ఆ బంధం చివరి దాకా కొనసాగింది. మరో వైపు చూస్తే నందమూరి వారి సినిమాలు ఎక్కడ పెద్దగా ఆడకపోయినా సీమలో మాత్రం బాగానే అడుతూంటాయి.
దానికి కారణం సీమవారులు పౌరుషానికి ప్రాణం పెడతారు. అలాంటి పాత్రలను వెండితెర మీద పండించడంతో నందమూరి హీరోలు ముందుంటారు. బాలయ్య సైతం సీమ కధలతో చేసిన ఎన్నో సినిమాలు అదరగొట్టాయి. ఇవన్నీ పక్కన పెడితే బాలయ్య తెలుగుదేశం పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నారు. అయితే ఆయన సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలన్న ఆలోచన మాత్రం చంద్రబాబుకు ఎపుడూ రాలేదు.
కానీ వచ్చే ఎన్నికలు చాలా క్లిష్టమైనవి, కష్టమైనవి. దంతో ఈసారి అన్ని వనరులనూ వాడుకోవాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా వైసీపీ కంచు కోటలను బద్ధలు కొట్టే కీలకమైన బాధ్యతలను బాలయ్యకు అప్పగిస్తున్నారు. వైసీపీ బలం అంతా సీమలోనే ఉంది. దాంతో సీమ నుంచి నరుక్కువస్తే కచ్చితంగా అధికార పీఠం తమ వశం అవుతుందని బాబు కరెక్ట్ గానే అంచనా వేశారు.
దాని కోసం తగిన అర్జునుడు బాలయ్యే అని కూడా గుర్తించారు. దాంతో వచ్చే ఎన్నికల్లో బాలయ్య కేవలం హిందూపురం అభ్యర్ధిగానే కాదు, రాయలసీమ మొత్తం కలియతిరిగి టీడీపీని అధికారంలోకి తీసుకురావాల్సిన బరువును మోయనున్నారుట.
బాలయ్యకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే చేయడానికి ఇష్టమే. ఇన్నాళ్ళకు బావగారు గుర్తించి నీవీ సీమ హీరో నీవే అంటున్నారు. పైగా రాయలసీమ రాసిచ్చేస్తాను అని చెబుతున్నారు. దాంతో బాలయ్య రెట్టించిన ఉత్సాహంతో సీమలో తిరుగుతారు అని అంటున్నారు. మరి బాలయ్య డైలాగులకు ఫిదా అయ్యే సీమ జనం టీడీపీ వైపు వస్తారా అన్నది చూడాలి.
ఇక జగన్ కి ఆయన కుటుంబానికి అచ్చి వచ్చిన సీమ జిల్లాలు టీడీపీకి టర్న్ అవుతాయా అన్నది కూడా ఆలోచించాలి. నిజానికి చంద్రబాబు సీమ వాసి. కానీ ఆయన్ని కోస్తా వారు ఆదరించినట్లుగా రాయలసీమ జనాలు ఆదరించలేదు అని చెబుతారు. అందుకే బాబు పాతికేళ్ళ టీడీపీ నాయకత్వంలో సీమలో ఎపుడూ తక్కువ సీట్లే దక్కాయి.
అలా బాబు నాయకత్వం మీద ఎంతో కొంత అసంతృప్తితో ఉన్న సీమ జనాలు బాలయ్యను ముందు పెడితే కచ్చితంగా గెలిపిస్తాయా. సైకిలెక్కేస్తాయా. మరి ఇంత జరుగుతూంటే జగన్ ఊరుకుంటారా. మరో వైపు బాలయ్య తొడకొడితే వైసీపీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. రాజకీయం సినిమా గ్లామర్ ఎపుడూ ఒకటి కాదు, మరి బాలయ్య ఎన్టీయార్ నట వారసుడిగా కనిపిస్తారా లేక పెద్దాయన రాజకీయ వారసుడిగా చూస్తారా అన్నది చూడాలి. ఇది కనుక తేలితే సీమలో ఎవరు గెలిచేది తెలిసిపోతుంది.