పవన్-బీజేపీల తెరవెనుక అసలు కథ ఇదే

Update: 2023-01-25 16:16 GMT
తెలుగు రాజకీయాల్లో జనసేన, బీజేపీ అడుగులు వ్యూహాత్మకంగా పడుతున్నాయి. మొన్నటి నుంచి రెండు పార్టీలు జనసేన, బీజేపీ రాజకీయాలు ఎత్తులు పైఎత్తులుగా నడుస్తోంది. జనసేన ఒక ఎత్తు వేసింది. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలని డిసైడ్ అయ్యింది. జగన్ ను గద్దె దించడమే ధ్యేయంగా వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనంటూ పవన్ శపథం చేశారు.అయితే  తెలుగుదేశం పార్టీకి కేవలం జనసేన పార్టీ మాత్రమే కావాలి. బీజేపీ అవసరం లేదు. ఆపార్టీకి టికెట్లు ఇస్తే వృథా అని.. తమకే బొక్కపడుతుందని టీడీపీ భావిస్తోంది. బలం లేని బీజేపీ వద్దనుకుంటోంది.

అయితే జనసేన మాత్రం బీజేపీని కలుపుకొని పోదామని చూస్తోంది. కానీ బీజేపీ మాత్రం ఎటూ తేల్చడం లేదు. బీజేపీని, జనసేనను కలుపుకుపోవడానికి కూడా టీడీపీ యోచిస్తోంది. ఇందుకోసం అహర్నిశలు శ్రమిస్తోంది. జగన్ ను ఓడించాలంటే వ్యతిరేక ఓటు చీల్చకుండా అందరినీ ఒక్కచోటుకు చేర్చాలని చూస్తోంది.

ఇప్పటికే బీజేపీలోకి పలువురు టీడీపీ ఎంపీలను,నేతలను చంద్రబాబు పువ్వుల్లో పెట్టి పంపించాడు. ఇక్కడ బీజేపీ నేతలపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చి పొత్తుకు టీడీపీ వెంపర్లాడింది. కానీ అవన్నీ సాధ్యంకాలేదు.

రాష్ట్రం నాయకత్వంలోని పాత బీజేపీ నేతలంతా టీడీపీతో కలిసేందుకు అస్సలు ఒప్పుకోవడం లేదు. సోము వీర్రాజు ను భయపెట్టి బీజేపీతో పొత్తుకు కన్నా లక్ష్మీనారాయణ సహా  టీడీపీ అనుకూల బీజేపీ నేతలను ఉసిగొల్పి పొత్తుకు ఒత్తిడి తెచ్చారు. మోడీ, షాలతోనూ టీడీపీ నేతలు పైరవీలు చేసి ఒప్పించే ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ సైతం బీజేపీపై తీవ్ర ఒత్తిడి తెచ్చినా ఫలితం కనిపించడం లేదు.

తాజాగా ఏపీలో నిర్వహించిన బీజేపీ కార్యవర్గ సమావేశంలో 175 స్థానాల్లో పోటీచేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. రణస్థలంలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ గౌరవప్రదంగా సీట్లు ఇచ్చే పార్టీతో పొత్తు ఉంటుందని.. టీడీపీతో పొత్తు ఉంటుందని.. బీజేపీని కలుపుకుపోతానని అన్నాడు. కానీ బీజేపీ దీన్నే వ్యతిరేకిస్తోంది.

బీజేపీతో ఉంటూనే తెలుగుదేశానికి బేరం పెట్టాడు పవన్. అయితే బీజేపీ కూడా టీడీపీతో వెళుతోందని ప్రచారం సాగింది. దీంతో టీడీపీతో కలవకూడదని అనుకుంటున్న బీజేపీ ఇప్పుడు 175 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించింది. జనసేనతో ఉండమని ప్రకటించారు. వైసీపీ, టీడీపీతో పొత్తు ఉండదని బీజేపీ ప్రకటించింది. జగన్ ను గద్దెదించడమే ధ్యేయమని తెలిపింది. ఇదొక వ్యూహాత్మక ఎత్తుగడ.. సో జనసేనాని పవన్ ను టీడీపీని వీడి తమతో రావాలని బీజేపీ ఇన్ డైరెక్టుగా హింట్ ఇచ్చింది.

ఇటు పవన్ టీడీపీతో కలిసి కలుపుకుపోతానని అంటుంటే బీజేపీ రానంటోంది. టీడీపీతో కలవనంటోంది. బీజేపీ ఒంటరిగా వెళతానంటోంది. మరి ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయన్నది వేచిచూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News