ముఖేష్ అంబానీ రావడం వెనక కారణం....?

Update: 2023-03-04 08:57 GMT
విశాఖలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కి దేశంలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ రావడం నిజంగా గ్రేట్. అంబానీ సౌతిండియాలో జరిగే ఏ  ఇన్వెస్టర్స్  సమ్మిట్స్ కి ఇప్పటిదాకా రాలేదు. ఒకవేళ మరీ రావాలని వత్తిడి వస్తే తన డైరెక్టర్స్ ని పంపి ఊరుకునేవారు.

అలాంటి అంబానీ ఏపీలో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కి ఎందుకు వచ్చారు. అది కూడా తొలిరోజునే. ఇక తనతో పాటు ఏకంగా పదిహేడు మంది డైరెక్టర్స్ ని వెంటబెట్టుకుని మరీ ముంబై నుంచి ప్రత్యేక విమానం లో విశాఖలో ఎందుకు ల్యాండ్ అయ్యారు. అంటే దానికి కారణాలు చాలా ఉన్నాయి.

ఏపీ సీఎం జగన్ తో ఆయనకు ఉన్న పరిచయాలు సాన్నిహిత్యం ఇక్కడ పనిచేసింది. ఇక ఒకనాడు ఇదే అంబానీ తాడేపల్లిలోని జగన్ ఇంటికి వెళ్ళి తన సహచరుడు రిలయెన్స్ లో కీలకమైన పరిమళ్ నత్వానీ కి రాజ్యసభ కోరారు. జగన్ అది ఆయనకు చాలా సులువుగా ఇచ్చారు. ఆనాటి నుంచి బంధం గట్టిపడింది.

ఇపుడు అంబానీ రావడం వెనక పరిమళ్ నత్వానీ కూడా ఉన్నారు. దాని కంటే మరో కారణం ఉంది అంటున్నారు. ఏపీలో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాలని అంబానీ తలపోస్తున్నారు. ఆయనకు ఇన్నాళ్ళకు సరైన రాజకీయ సహకారం దొరికింది. చంద్రబాబు టైం లో కూడా ఆయన ట్రై చేసి రావచ్చు. కానీ నాడు ఏ సమీకరణలు పనిచేయలేదో కానీ ఇపుడు అంతా సాఫీగా ఉంది.

పైగా జగన్ తో మంచి క్లోజ్ నెస్ ఉంది. జగన్ కూడా పూర్వాశ్రమంలో వ్యాపారాల్లో ఉన్నారు. ఆయనకు కూడా ముంబైలో కార్పోరేట్ దిగ్గజాలతో పరిచయాలు ఉన్నాయి. దాంతో ఇవన్నీ కలిసే అంబానీ గ్లోబల్ సమ్మిట్ కి వచ్చేశారు.

ఇక ఇంకో కారణం ఏంటి అంటే విశాఖ జిల్లా పరవాడ ప్రాంతంలో భారీ ఇండస్ట్రియల్ క్లస్టర్ ని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేసింది. దాంతో విశాఖలో పెట్టుబడులకు కూడా అంబానీ తన టూర్ ని వాడుకున్నారని అంటున్నారు. అలాగే పరవాడ ఇండస్ట్రియల్ క్లస్టర్ విషయంలోనూ ఆయన ఆసక్తిని చూపుతున్నారని అంటున్నారు. ఏపీలో ఇపుడు అంబానీ పెట్టుబడులకు ఏ రంగంలో అయినా ఓకే చేయడానికి జగన్ సిద్ధంగా ఉన్నారు. ఇంతలా ఫ్రెండ్లీ సర్కార్ ని ఆయన గతంలో చూశారో లేదో కానీ ఏపీ రెడ్ కార్పేట్ పరవడంతో అంబానీ స్వామి కార్యం, స్వకార్యం అన్నట్లుగా వచ్చారని తెలుస్తోంది.

వీటితో పాటు రాజకీయ ఆశలు కూడా కొన్ని ఉన్నాయని గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. ఈసారి ఎవరిని తెచ్చి ఎంపీ అడుగుతారో కూడా చూడాలి. ఏది ఏమైనా అంబానీ రావడం ద్వారా జగన్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కి నూరు మార్కులు జనాలు వేసేలా చేశారు. ఈ క్రెడిట్ జగన్ కి దక్కేలా చేశారు అంటే అంబానీ జగన్ ల మధ్య బంధం బహు దృఢమైనది అని అనిపించకమానదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News