ఆ రెడ్డి ఇంటికేనా.. వైసీపీ గుస‌గుస‌..!

Update: 2021-10-23 02:30 GMT
వైసీపీలో కొంద‌రు ఎమ్మెల్యేల‌కు సంబంధించిన రికార్డులు, రిపోర్టులు.. పార్టీలో చ‌ర్చ‌నీయాంశంగా మారా యి. ముఖ్యంగా కొంద‌రు ఎమ్మెల్యేల‌పై వ‌చ్చిన రిపోర్టుల‌ను బ‌ట్టి.. వారిని సాగ‌నంపుతార‌నే చ‌ర్చ జోరుగా సాగుతోంది. వీరిలో అనంత‌పురం జిల్లా తాడిప‌త్రి నుంచి గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న కేతిరెడ్డి పెద్దారెడ్డి పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. నిజానికి రాష్ట్రంలో ఏ నియోజ‌క‌వ‌ర్గానికీ లేని ప్ర‌త్యేక‌త ఇక్క‌డ ఉంది. దాదాపు నాలుగు ద‌శాబ్దాలుగా ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకున్న జేసీ కుటుంబానికి చెక్ పెడుతూ.. వైసీపీ త‌ర‌ఫున పెద్దారెడ్డి విజ‌యం సాధించారు.

అయితే.. ఈ విజ‌యం అంతా త‌న‌దేననే ధీమాతో ఉన్నారో.. లేక వైసీపీ లేక‌పోయినా.. తాను ఒంట‌రిగా అయి నా.. గెలుస్థాన‌నే ధైర్యంతో ఉన్నారో తెలియ‌దుగానీ.. నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ట్టు సాధించేందుకు ఏమాత్రం ప్ర‌య‌త్నం చేయ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. పైగా ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లోకానీ.. ఇత‌ర ఎన్నిక‌ల్లోకానీ.. వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా విజ‌యం ద‌క్కించుకుంటే.. తాడిప‌త్రిలో మాత్రం పెద్దారెడ్డి మేనేజ్ చేయ‌లేక పోయారు. దీంతో జేసీ వ‌ర్గం పుంజుకుంది. దీంతో ఇక్క‌డ టీడీపీ మునిసిపాలిటీని ద‌క్కించుకుంది. పైగా స‌వాల్ చేసి మ‌రీ మాజీ ఎమ్మెల్యే ప్ర‌భాక‌ర్ రెడ్డి మునిసిప‌ల్ చైర్మ‌న్ అయ్యారు. జ‌గ‌న్ సైతం మున్సిపాల్టీ పోవ‌డంతో పెద్దారెడ్డికి చీవాట్లు పెట్టార‌న్న చ‌ర్చ‌లు కూడా పార్టీలో వినిపించాయి.

ఇక్క‌డ జేసీ ఫ్యామిలీకి పూర్తిగా చెక్ పెట్టాల‌ని ప‌దే ప‌దే అధిష్టానం వార్నింగ్‌లు ఇస్తున్నా పెద్దారెడ్డికి ప‌ట్టు చిక్క‌డం లేదు. చివ‌ర‌కు ఇప్పుడు కేడ‌ర్ సైతం చేజారుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇటీవ‌ల జేసీ అస్మిత్‌రెడ్డి స‌మ‌క్షంలో తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన 100 మంది వైసీపీ కార్య‌కర్త‌లు టీడీపీ పార్టీలోకి చేరారు. ఈ ప‌రిణామాన్ని పార్టీ అధిష్టానం సీరియ‌స్‌గా తీసుకుంది. దీనికి వివ‌ర‌ణ ఇవ్వాలంటూ.. పెద్దారెడ్డిని కోరింది. దీనికి ఆయ‌న ఎలాంటి వివ‌ర‌ణ ఇస్తారో తెలియ‌దు కానీ.. పార్టీ మాత్రం ఇక్క‌ట్ల‌లో ప‌డిపోయింద‌నే వాద‌న మాత్రం అధిష్టానానికి చేరింది.

ఈ నేప‌థ్యంలో త‌న వ్య‌క్తిగ‌త క‌క్ష‌ల‌కు.. కోరిక‌ల‌కు.. ప్రాధాన్యం ఇస్తున్న పెద్దారెడ్డి.. నియోజ‌క‌వ‌ర్గం ప‌రిస్థితిని ఏమాత్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌నే విమర్శ‌లు కూడా రావ‌డంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో పెద్దారెడ్డిని ప‌క్కన పెట్ట‌డం ఖాయ‌మ‌నే వాద‌న వినిపిస్తోంది. ఇది బ‌య‌ట‌కు పొక్కేయ‌డంతో అప్పుడే ఇక్క‌డ టిక్కెట్‌పై క‌న్నేసిన నాయ‌కులు త‌మ వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నారు.




Tags:    

Similar News