క్వీన్ ఎలిజిబెత్ 2 రికార్డులు మరెవరూ ఎప్పటికి టచ్ చేయలేరంతే

Update: 2022-09-09 04:35 GMT
తరతరాలకు సుపరిచితురాలైన బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ 2. ఆమె అసలు పేరు ఎలిజబెత్ అలెగ్జాండర్ మేరీ. డ్యూక్ ఆఫ్ యార్క్ అయిన ప్రిన్స్ అల్బర్ట్.. ఆయన భార్య లేడీ ఎలిజబెంత్ బోవెస్ - లియాన్ ల పెద్ద కుమార్తె. 1926 ఏప్రిల్ 21న లండన్ లో జన్మించారు.తన 96 ఏళ్ల వయసులో ఆమె తుదిశ్వాస విడిచారు.

తండ్రి మరణంతో యూనైటెడ్ కింగ్ డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్.. నార్తర్న్ ఐర్లండ్ లకు తన పాతికేళ్ల వయసులో అంటే 1952 ఫిబ్రవరి 6న మహారాణిగా లాంఛనప్రాయ బాధ్యతలు చేపట్టారు. ఏకంగా ఏడు దశాబ్దాలు ఆమె రాణిగా పాలించారు.

21 ఏళ్ల వయసులోనే తన జీవితాన్ని కామన్వెల్త్ దేశాలకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించిన ఆమె.. జీవితంలో ఆమె నెలకొల్పిన రికార్డుల్ని సమీప భవిష్యత్తులో మరెవరూ బద్ధలు కొట్టటం తర్వాత టచ్ చేసేంత దగ్గరకు కూడా వచ్చే అవకాశం లేదన్న మాట వినిపిస్తోంది.

బ్రిటన్ ను అత్యధిక కాలం పాలించిన రాణిగా ఆమె 2015లోనే రికార్డును క్రియేట్ చేశారు. క్వీన్  విక్టోరియా 63 ఏళ్ల 7నెలల 2 రోజుల పాటు పాలన సాగించగా.. ఆ రికార్డును క్వీన్ ఎలిజబెత్ 2 బద్దలు కొట్టారు. గురువారం ఆమె తుదిశ్వాస విడిచే నాటికి ఆమె 70 ఏళ్ల 7నెలల 3 రోజుల పాటు పాలించారు. తన హయాంలో 4వేల చట్టాలకు ఆమోద ముద్ర వేశారు.

ఆమె హయాంలో బ్రిటన్ కు మొత్తం 15 మంది ప్రధానులు సేవలు అందించటం గమనార్హం. చైనాను సందర్శించిన.. అమెరికాలో ప్రతినిధుల సభను ఉద్దేశించి ప్రసంగించిన తొలి బ్రిటిష్ మహారాణిగా ఆమె చరిత్రను క్రియేట్ చేవరాు. భర్త ప్రిన్స్ ఫిలిప్ తో పాటు 73 ఏళ్ల పాటు కలిసి జీవించి మరో రికార్డు ఆమె పేరుతో ఉంది.

గత ఏడాది ఏప్రిల్ లో తన 99వ ఏట ఆయన తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ దంపతులకు నలుగురు సంతానం. మహరాణి హోదాలో ఆమె మొత్తం వందకు పైగా దేశాల్లో పర్యటించారు. అత్యధికంగా 22 సార్లు కెనడాను సందర్శించిన ఆమె.. భారత్ కు మాత్రం మూడుసార్లు (1961, 1983, 1997)లో సందర్శించారు. భారత అతిధ్యానికి ముగ్దులయ్యారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News