రాజకీయాల్లో ఉన్న వారు అంతా ఒకే తానులో ముక్కలు అని ఫిలాసరీ బండగా చెప్పుకుంటారు. అక్కడ ఎవరు ఏ పార్టీలో ఉన్నా కామన్ సూత్రం ప్రకారం అంతా ఒక్కటే, అందరూ బంధువులే అని కూడా అంటారు. కానీ ఇపుడు ఒక ఆసక్తికరమైన విషయాన్ని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బయటపెట్టారు. అదేంటి అంటే చంద్రబాబు తనకు దూరం చుట్టం అవుతారు అని. అలాగే వరసకు అన్నయ్య అవుతారు అని.
అదెలా అంటే విజయసాయిరెడ్డి భార్త సోదరి కుమార్తెని సినీ నటుడు, ఎన్టీయార్ మనవడు తారకరత్న చేసుకున్నారు. దాంతో చంద్రబాబు తనకు ఆ విధంగా అన్నయ్య అవుతారని విజయసాయిరెడ్డి పరమసత్యాన్ని చెప్పారు. తామిద్దరం కూడా బంధువులమే సుమా అని అని చెప్పుకున్నారు అన్న మాట.
అరబిందో కంపెనీకి అడాన్ కంపెనీకి ఒకరే కామన్ డైరెక్టర్ గా ఉండడంతో తమ కుటుంబానికి ఆడాన్ కంపెనీతో సంబంధాలు ఉన్నాయంటూ చంద్రబాబు ఎల్లో మీడియా తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. కనీసం లాజిక్ లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు.
ఒక డైరెక్టర్ ఎన్నో కంపెనీలకు డైరెక్టర్ గా ఉంటారని, అంత మాత్రం చేత ఆయా కంపెనీలు అన్నీ ఒకరివి అయిపోతాయా అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఇక నారా బ్రాహ్మణి, నారా భువనేశ్వరి పదిహేడు పద్దెనిమిది కంపెనీలకు డైరెక్టర్లుగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా ఆయన తెలియచేయడం విశేషం. అన్ని కంపెనీలకు హైదరాబాద్ పంజాబుట్ట ఆఫీస్ అడ్రస్ నే ఇచ్చారని కూడా ఆయన చెప్పారు.
తాము రాజకీయాలు మాత్రమే మాట్లాడుతామని, కుటుంబాలను మధ్యకి తేవద్దు అని విజయసాయిరెడ్డి ఈ సందర్భంగా టీడీపీకి గట్టిగానే హెచ్చరించారు. ఫ్యామిలీస్ ని కనుక తెస్తే తాము కూడా ఆ వైపుగా మాట్లాడాల్సి వస్తుందని ఆయన స్పష్టం చేశారు.
మొత్తానికి తెల్లారిలేస్తే చంద్రబాబుని నానా రకాలుగా విమర్శలు చేసే విజయసాయిరెడ్డి ఆయనకు తమ్ముడు వరస అవుతారు అంటే ఇది చాలా ఇంటరెస్టింగ్ పాయింటే సుమా అని ఏపీ జనాలు అనుకుంటున్నారు.