జైలు నుంచి జయలలిత బిడ్డకు విడుదల

Update: 2021-10-16 13:33 GMT
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ముచ్చటపడి దత్తపుత్రుడిగా పెంచుకున్న వ్యక్తికి ఎట్టకేలకు విముక్తి దొరికింది. అక్రమాస్తుల కేసులో జైలు పాలైన జయలలిత మాజీ వారసుడు ఈరోజు జైలు నుంచి విడుదలయ్యాడు. ఆయన అవతారం చూసి కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. అంతా అనుకున్నట్లు జరిగితే ఇతడే జయలలిత తర్వాత రాజకీయ వారసుడు అయ్యేవాడు. కానీ టైం బ్యాండ్ తో బుక్కయ్యాడు.

జయలలిత అప్పట్లో ఒకరిని దత్త పుత్రుడిగా దత్తత తీసుకున్న సంగతి తెలిసింది. మధ్యలో ఇతగాడి వ్యవహారం తెలిసి జయలలిత తన్ని తరిమేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో చిన్నమ్మ శశికళతో పాటు జయలలిత మాజీ దత్తపుత్రుడు సుధాకరన్ కూడా బెంగళూరు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించాడు.

గత ఏడాది అపరాధ రుసుం చెల్లించిన శశికళ అండ్ కోటరీ జైలు నుంచి విడుదలయ్యారు. అయితే సుధాకరణ్ మాత్రం అపరాధ రుసుం చెల్లించను అంటూ సంవత్సరం పాటు జైల్లోనే ఉన్నాడు. ఇప్పుడు సుధాకరన్ బయటకు వచ్చాడు.

గతంలో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత, చిన్నమ్మ శశికళ కుటుంబ సభ్యులు అంతా కలిసిమెలిసి ఉండేవారు. ఆ సమయంలో శశికళ సమీప బంధువు వీఎన్ సుధాకరన్ ను జయలలిత దత్తత తీసుకుంది. జయలలిత తన సొంతు కొడుకులా చూసుకుంది. జయలలిత వారసుడిగా సుధాకరన్ అప్పట్లో వీరలెవల్లో పాటుపడ్డాడు. అయితే సుధాకరణ్ ను అడ్డం పెట్టుకొని శశికళ కుటుంబం భారీగా అక్రమంగా డబ్బులు సంపాదించడం మొదలుపెట్టారని విమర్శలున్నాయి. వారి అక్రమాల గురించి జయలలితకు తెలిసింది. అమ్మ ఆగ్రహం వ్యక్తం చేసి దత్తపుత్రుడు సుధాకరణ్ ను మెడపట్టి బయటకు గెంటేశారు. అప్పటి నుంచి శశికళతో పాటు దత్తపుత్రుడు సుధాకరన్, వారి కుటుంబ సభ్యులను జయలలిత తన ఇంటి దరిదాపుల్లోకి రానీయలేదు.

జయలలిత అనారోగ్యంతో చనిపోయిన తర్వాత శశికళ పగ్గాలు తీసుకోవడం.. అక్రమాస్తుల కేసులో శశికళ, ఇళవరిసి, సుధాకరన్ కూడా అరెస్ట్ అయ్యారు. కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష, 10 కోట్ల జరిమానా విధించింది. జరిమానా చెల్లించకపోతే మరో సంవత్సరం రోజులు జైలు శిక్ష అనుభవించాలని బెంగళూరు కోర్టు తీర్పునిచ్చింది. శశికళ కట్టి ఏడాది ముందు విడుదల కాగా.. సుధాకరన్ డబ్బులు కట్టకుండా సంవత్సరం జైలు శిక్ష అనుభవించి విడుదలయ్యాడు.
Tags:    

Similar News