భూమిపై 8వ ఖండం కనుగొన్నారు.. ఎక్కడంటే?

Update: 2020-06-27 03:30 GMT
భూమిపై ఇప్పటిదాకా ఏడు ఖండాలే.. కానీ ఇప్పుడు 8వ ఖండాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దానికి ‘జిలాండియా’ అనే పేరు పెట్టారు. న్యూజిలాండ్ దేశానికి దగ్గరలో ఈ ఖండం ఉంది.

ఒకప్పుడు అన్ని ఖండాల్లోనే జిలాండియా కూడా సముద్రంలో పైకి తేలుతూ ఉండేదట.. కొన్ని కారణాల వల్ల ఇది సముద్రంలో కలిసిపోయింది. 2017లో దీన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు.

జిలిండియా చిన్న ఖండం ఏమీ కాదు.. దాదాపు 50 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇది వ్యాపించి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

తాజాగా న్యూజిలాండ్ శాస్త్రవేత్తలు బాతిమెట్రి అనే విధానం ద్వారా ఈ ఖండం మ్యాప్ ను తయారు చేశారు. 50 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించిన ఈ జిలాండియా ఖండంలో కేవలం 6శాతం మాత్రమే సముద్రం పైకి కనిపిస్తుండడం గమనార్హం.

న్యూ క్యాలడోనియా దీవులు విస్తరించిన ప్రాంతంలో ఈ జిలాండియా ఖండం ఉంది. 1995లో బ్రూస్ లుయెండిక్ అనే భౌతిక శాస్త్రవేత్త మొదట ఎనిమిదో ఖండాన్ని గుర్తించారు. దానికి ఆ పేరు పెట్టారు.
Tags:    

Similar News