నటి సుమలతపై విమర్శలు చేస్తున్న జేడీఎస్ హద్దు మీరింది. ఆమెపై వ్యక్తిగత ఆరోపణలకు వెనుకాడని ఈ పార్టీ ..ఈ సారి మరింత అనుచితమైన వ్యాఖ్యలు చేసింది. ఈ సారి జేడీఎస్ అధినేత దేవేగౌడ తనయుడు రేవణ్ణ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికే జేడీఎస్ మంత్రి తమ్మణ్ణ సుమలతను లక్ష్యంగా చేసుకుని పలు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు రేవణ్ణ రెచ్చిపోయారు.
‘భర్త చనిపోయి నెల రోజులు కాలేదు..అప్పుడే నీకు రాజకీయాలు కావాల్సి వచ్చాయా?’అంటూ ఈ మంత్రిగారు వ్యాఖ్యానించారు. కుమారస్వామికి స్వయాన సోదరుడు అయిన ఈ మంత్రిగారు.. ఇలా సుమలత మీద అక్కసు వెల్లగక్కారు. అంబరీష్ ఇటీవలే మరణించిన సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యం రాజకీయంగా అంబరీష్ స్థానాన్ని భర్తీ చేసేందుకు సుమలత ముందుకు వస్తున్నారు. ఆమె మీద జేడీఎస్ విరుచుకుపడుతోంది.
ఆమె రంగంలోకి దిగి తమ సీటుకు ఎక్కడ ఎర్త్ పెడుతుందో అనేది వీరి భయం. అందుకే ఇలాంటి నీఛమైన మాటలకు కూడా వెనుకాడటం లేదు. సుమలతపై రేవణ్ణ చేసిన వ్యాఖ్యలపై పెను దుమారం రేగుతోంది. ఒక మహిళా ప్రముఖురాలని ఉద్ధేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమిటని.. అనేక మంది రేవణ్ణపై దుమ్మెత్తి పోస్తున్నారు.
అదలా ఉంటే..సుమలతకు తాము టికెట్ ఇచ్చేందుకు రెడీ అని కుమారస్వామి అంటున్నాడు. అయితే ఆయన ఇక ట్విస్టు కూడా ఇచ్చారు. సుమలత కావాలంటే.. మైసూర్- కొడగు టికెట్ ను ఇస్తామని ఆయన అన్నారు.
ఆమె మండ్య నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో కుమారస్వామి వేరే ప్రతిపాదన చేశారు. వేరే నియోజకవర్గం పేరు చెప్పి.. అక్కడ నుంచి అయితే సుమలతకు టికెట్ ఇస్తామని అన్నారు కుమారస్వామి. మరి ఈ విషయంలో సుమలత ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి!