రేవంత్ మరీ ఎక్కువగా ఊహించుకుంటున్నారా? ప్రగతిభవన్ ఎంట్రీకి భలేగా లింకు పెట్టేశారే?
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పేరును పార్టీ అధికారికంగా ప్రకటించిన నాటి నుంచి ఫుల్ రీఛార్జి అయిన బ్యాటరీ మాదిరి చెలరేగిపోతున్నారు. వచ్చిన అవకాశాన్ని ఏ మాత్రం విడిచిపెట్టుకోకూడదన్నట్లుగా ఆయన తీరు ఉంది. తన టార్గెట్ సీఎం కేసీఆరేనని.. ప్రగతి భవన్ ను తరచూ తన మాటల్లో తీసుకొచ్చే ఫైర్ బ్రాండ్.. తాజాగా ఆసక్తికర వ్యాఖ్య చేశారు.
తనకు పీసీసీ చీఫ్ పదవి వస్తుందని నిఘా వర్గాల నుంచి సమాచారం అందుకున్నంతనే ప్రగతిభవన్ తలుపులు తెరిచినట్లుగా ఆయన వ్యాఖ్యానించారు. ఖబడ్డార్.. కేసీఆర్. నీ సంగతి చూస్తా. కరెంటు తీగలా కాదు.. హైటెన్షన్ వైరులా కోట్లాడతానంటూ విరుచుకుపడ్డారు. నిజంగానే రేవంత్ కు పీసీసీ పగ్గాలు ఇస్తున్నారనే ప్రగతిభవన్ తలుపులు తెరిచారా? అంటూ అది మరీ అతిశయమనే చెప్పాలి. మరింత వివరంగా చెప్పాల్సి వస్తే.. బోడిగుండుకు మోకాలికి లింకు పెట్టినట్లే.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా.. త్వరలో జరిగే ఉప ఎన్నికల నేపథ్యంలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు కేసీఆర్. అధినేతపై ఈటల చేసిన ప్రధాన ఆరోపణల్లో.. ప్రగతిభవన్ కు వచ్చిన మంత్రుల్ని సీఎం పట్టించుకోరని.. వారికి అపాయింట్ మెంట్ కూడా ఇవ్వరని. ఆ మాటల్లో ఎలాంటి నిజం లేదన్న విషయాన్ని చెప్పేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. దీనికి తోడు ఆయనకు ప్రతిష్టాత్మకమైన హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో.. తాను మునుపటితో పోల్చినప్పుడు పూర్తిగా మారిపోయానన్న భావన కలిగేలా ఆయన తీరు ఉందన్న మాట వినిపిస్తోంది.
ఈ పరిణామాన్ని తనకు అనుకూలంగా ఆపాదించుకొని కేసీఆర్ మీద చెలరేగిపోతున్నారు రేవంత్. మొత్తంగా చూస్తే.. ఏ చిన్న పరిణామం చోటు చేసుకున్నా.. దాన్ని తనకు అనుకూలంగా వాదన వినిపించేలా రేవంత్ మాటలు ఉన్నాయన్న భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మరి.. దీనికి కేసీఆర్ ఎలాంటి కౌంటర్ ఇస్తారో చూడాలి.