తెలంగాణ టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీ మారబోతున్నారన్న ఎపిసోడ్ ఇటు టీడీపీ - అటు కాంగ్రెస్ లోనూ పెద్ద ఎత్తున చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. టీటీడీపీ నుంచి ఎవరు పార్టీ మారతారోనన్న చర్చ తెలుగుతమ్ముళ్లలో జరుగుతుండగా. అటు కాంగ్రెస్ లోనూ ఎవరు రాబోతున్నారు.... వారు వస్తే తమకు వస్తే ఇబ్బందేంటి? సర్దుబాట్లను ఎలా చేస్తారన్న హాట్ డిస్కషన్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరికపై రేవంత్ రెడ్డి హఠాత్తుగా యూటర్న్ తీసుకున్నారు. తాను పార్టీ మారడం లేదని ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో పడేశారు.
తన వ్యాఖ్యల ద్వారా పార్టీ మారటం లేదని రేవంత్ సంకేతాలు ఇస్తున్నా...ఆయన మాటలను టీ టీడీపీ నేతలు నమ్మడం లేదు. ఆయన మాటల్లో స్పష్టత లేదని చెబుతున్నారు. అయితే రేవంత్ యూటర్న్ వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయని అంటున్నారు. స్వయంగా ఆయన నియోజకవర్గం కొడంగల్ లోనే ఇన్నాళ్లు ఆయనను చూసి టీడీపీలో కొనసాగిన కొందరు నేతలు టీఆర్ ఎస్ లో చేరారు. దీంతో కంగుతిన్న రేవంత్ పార్టీలోనే కొనసాగుతున్నట్లు చెప్పారని అంటున్నారు. మరోవైపు ఇప్పుడు ఆయన టీడీపీలో ఉంటున్నానని చెప్పినంత మాత్రాన వారు తిరిగి వచ్చే పరిస్థితి లేదంటున్నారు.
కాగా, టీడీపీ అధినేత చంద్రబాబు రంగంలోకి దిగడం వల్లే రేవంత్ రెడ్డి ఓ మెట్టు దిగారని... పార్టీ అధినేత ఆయనకు నచ్చచెప్పారా అనే చర్చ సాగుతోంది. పార్టీ యువనేత లోకేష్ కూడా చర్చించి ఉంటారని అనుకుంటున్నారు. మరోవైపు.. రేవంత్ ఆలస్యంగా స్పందించినా జరగాల్సిన నష్టం జరిగిందంటున్నారు. మొత్తంగా... అధిష్టానం చెంతకు చేరిన ఈ పంచాయతీ ఎటువైపు టర్న్ తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
మరోవైపు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న రేవంత్ రెడ్డి సడన్ గా ఇలాంటి ప్రకటన చేయడం ఆ పార్టీ నేతలకు తీవ్రంగా అసహనానికి గురయ్యేలా చేసిందంటున్నారు. రేవంత్ తమతో డబుల్ గేమ్ ఆడారా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా రేవంత్ టీడీపీలో ఉన్నా...కాంగ్రెస్ లో చేరినా...తన ఇమేజ్ ను మాత్రం కోల్పోయింది నిజమని చెప్తున్నారు.