రేవంత్ దూకుడులో ఇదో కొత్త కోణం!

Update: 2018-11-18 05:15 GMT
డిసెంబర్ 7న జరగనున్న తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ ఎస్‌ ను ఓడించేందుకు కాంగ్రెస్ - టీడీపీ - తెలంగాణ జన సమితి - సీపీఐ కలిసి ప్రజా కూటమిగా ఏర్పడిన సంగ‌తి తెలిసిందే. సైద్ధాంతిక విరోధి అయిన కాంగ్రెస్‌ తో జ‌ట్టుక‌ట్టి మ‌రీ బాబు ఈ ఎన్నిక‌ల బ‌రిలో దిగుతున్నారు. ఏకంగా త‌క్కువ సీట్లలో పోటీకి కూడా అంగీక‌రించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షమ‌ని - దీంతో మెజారిటీ సీట్లలో కాంగ్రెస్ పోటీ చేస్తోందని క‌వ‌ర్ చేసుకుంటుంది. టీడీపీ 14 - టీజేఎస్ 8 - సీపీఐ 3 సీట్లలో పోటీ చేయాలని నిర్ణయించారు. అయితే, ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఎవరి స్థాయిలో వారు రోడ్‌ షోలతో స్పీడ్‌ పెంచుతున్నారు. కొన్ని చోట్ల కూటమి నాయకులు కలిసి.. కొన్ని చోట్ల విడివిడిగా ప్రచారంలో మునిగిపోయారు.

అయితే, తెలంగాణలో తిరుగులేని నేతగా ఎదిగిన కేసీఆర్‌ కు చెక్‌ పెట్టేందుకు చేతులు కలిపిన విపక్షాల నేతలు నేటి వరకు నిప్పు..ఉప్పులా ఉన్న నేతలు ఇప్పుడు కండువాలు మార్చుకుని ఒకే నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నారు. తాజాగా ఈ క్రమంలో కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి చేస్తున్న ప్ర‌చారం ఆస‌క్తిక‌రంగా మారింది. కాంగ్రెస్‌-టీడీపీ నేతలు కలిసి మెలిసి రూపొందించిన ప్రచార పోస్టర్‌ హాట్‌ టాపిక్‌ గా మారింది. ఓ వైపు ఏఐసీసీ నేత రాహుల్‌ గాంధీ.. మరోవైపు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయడు.. మధ్యలో సోనియా గాంధీ - టీజేఎస్‌ నేత కొదండరామ్‌ చిత్రాలతో రూపొందిన ఈ పోస్టర్‌ టాక్‌ ఆఫ్‌ ద టౌన్‌ గా మారింది. ముఖ్యంగా... రాహుల్‌ గాంధీ - చంద్రాబాబు ఫొటోలు ఒకే పోస్టర్‌ లో కనిపించడం ఆసక్తికరంగా మారింది.

ఇదిలా ఉండ‌గా - తెలంగాణ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ - టీడీపీ అధినేత - ఏపీ సీఎం చంద్రబాబుతో కలిసి భారీ ర్యాలీకి సన్నాహాలు చేస్తున్నారు. ఇరు పార్టీల నేతలు ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ర్యాలీ - మొదటి ఎన్నికల సభ హైదరాబాద్ వేదికగా ఈ నెల చివర్లో ఉండే అవకాశం ఉంది.
Tags:    

Similar News