రేవంత్ సంచ‌ల‌నం..నాపై ఈడీ దాడులు

Update: 2018-09-17 13:30 GMT
తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ నేత - మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గాంధీభ‌వ‌న్‌ లో మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి త‌న‌పై ఈడీ దాడులు జ‌ర‌గ‌నున్నాయ‌ని క‌ల‌క‌లం రేపే కామెంట్లు చేశారు. త‌మ ప్రభుత్వ రద్దుకు ముందు కేసీఆర్ - కేటీఆర్ కొన్ని సార్లు అధికారికంగా - కొన్నిసార్లు రహస్యంగా ఢిల్లీలో పర్యటించార‌ని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ హక్కుల కోసమ‌ని వారు పేర్కొంటూ తమ స్వంత లబ్ది కోసం అని తాము చాలాసార్లు చెప్పామన్నారు. రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ లో చేరిన తరువాత - కాంగ్రెస్ పార్టీలో రాణించకుండా కుట్ర చేపట్టాడు కానీ కేసీఆర్ సఫలీకృతం కాలేదని సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో ముందస్తు ఎన్నికల సందర్బంగా రేవంత్ రెడ్డికి పదవి ఇస్తే టీఆర్ ఎస్‌ ను అడ్డుకుంటాడని అక్రమ కేసులు పెట్టించాడని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక మళ్లీ ఓటుకు నోటు కేసును తెర‌మీద‌కు తెస్తున్నార‌ని రేవంత్ రెడ్డి వెల్ల‌డించారు. ``ఏ4గా ఉన్న మత్తయ్యను ఎఫ్ ఐఆర్ దాఖ‌లు చేయకుండా అరెస్ట్ చేయడంలో కోర్టును కూడా త‌ప్పుదోవ ప‌ట్టించారు. చంద్రబాబు స్టీఫెన్‌ సన్‌ తో ఫోన్లో మాట్లాడాడు అని అందులో ఇరికించారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్తే ప్రభుత్వానికి అనుకూలంగా రాలేదు. ఇప్పుడు కేసీఆర్ - మోడీ రహస్య‌ ఒప్పందం ద్వారా మరోసారి కేసును తిరగదొదాలనుకుంటున్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలు నచ్చక చంద్రబాబు ప్రభుత్వం నుండి బయటకి వచ్చాడు. అప్పటి నుండి కేసీఆర్-మోడీ ఒకే దెబ్బకు రెండు పిట్టలు లాగా ఈడీ - సీబీఐ ద్వారా ఓటుకు నోటు కేసుపై...నా పైన నా బందువులపైన ఇన్‌ కమ్ టాక్స్ దాడులు చేయాలని ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ప్రణాళిక బద్దంగా నా పై నకుటుంబ సభ్యులు పైమ ఈడీ దాడులు చేయాలని సిద్ధమైంది`` అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

రాబోయే రోజులు అత్యంత కీలకమ‌ని - కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని రేవంత్ రెడ్డి కోరారు. ``రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి కేసీఆర్ కు చట్టాన్ని ఉల్లంఘించి సహకరిస్తున్నారు. డీజీపీ పాత డేట్లపై లేఖలు రాస్తున్నారు త‌నపైన విచారణకు ప్ర‌య‌త్నిస్తున్నారు. చట్టవ్యతిరేకమైన చర్యలతో ప్రైవేట్ సైన్యంతో డీజీపీ కేసీఆర్‌ కు ఖాసిమ్ రజ్విలాగా ప‌ని చేస్తున్నాడు. నాకు, నా కుటుంబ సభ్యులకు ఏం జరిగినా - కేసీఆర్ - ప్రభాకర్ రావు - డీజీపీయే కారణం. కాంగ్రెస్ అధినాయకత్వం నాకు ముఖ్యమైన పదవి ఇచ్చే అవకాశం ఉండటంతో - రాష్ట్రం అంతా తిరుగుతాడు కాబట్టి ఇలాంటి పనులకు టీఆరెస్ పార్టీ - కేసీఆర్ కుట్ర చేస్తున్నారు`` అంటూ వెల్ల‌డించారు. రేవంత్ రెడ్డి మీద ఈడీ దాడులు జరుగుతాయి అని పార్టీ శ్రేణులకు కేసీఆర్ మెస్సేజ్ ఇచ్చారని ఆరోపించారు. ``డీజీపీ మహేందర్ రెడ్డి కేసీఆర్ ప్రైవేట్ సైన్యానికి అధిపతి. నాకు పదవి ఇచ్చే రెండు రోజులముందే నా పై ఈడీ దాడులు జరుగుతాయి. చిప్పకూడు తిన్న విశ్వాసంతో చెప్తున్న మీ పైజామాలు ఉడుతాయి`` అని వ్యాఖ్యానించారు.
Tags:    

Similar News