వారిద్దరు ప్రత్యర్దులు. ఒకరు ఓ పార్టీలో ఓ వెలుగు వెలిగినవారు. మరోకరు మరో పార్టీలో సౌమ్యుడిగా మంచి నాయకుడిగా పేరుతెచ్చుకున్నవారు. ఇప్పుడు వారిద్దరి మధ్య వైరం తారాస్ధాయికి చేరుకుంటోంది. వారిద్దరిలో ఒకరు తెలుగుదేశం పార్టీలో ఓ వెలుగు వెలిగి కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి అయితే, మరొకరు అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రి లక్ష్మారెడ్డి. వీరిద్దరూ మహాబూబ్ నగర్ జిల్లాలో విశేషమైన కార్యకర్తలు - అభిమానులు ఉన్న నాయకులు. ప్రస్తుత రాజకీయాలు వారిద్దరి చుట్టే తిరుగుతున్నాయి. మహాబూబ్ నగర్ జిల్లాలో కొడంగల్ నుంచి ప్రాతినిథ్యం వహించే రేవంత్ రెడ్డి ఇప్పుడు జడ్చర్ల నుంచి పోటి చేయాలనుకుంటున్నారని వార్తలొస్తున్నాయి. అక్కడ మంత్రి లక్షారెడ్డి శాసనసభ్యుడిగా ఉన్నారు. ఆ స్దానం నుంచి పోటి చేస్తే రేవంత్ రెడ్డి గెలుపు మాట అలా ఉంచితే లక్షారెడ్డి మాత్రం ఇరుకున పడతారు.
ఒకే కులానికి చెందిన ఇద్దరు నాయకులు ఒక చోట నుంచే పోటి చేయాడం ఆ కులానికి చెందిన వారికి మింగుడు పడటం లేదు. తెలంగాణలో వెలమ - రెడ్డి కులాల మధ్య వైరం ఉంది. ఒకరిపైఒకరు ఆదిపథ్యం చూపించేందుకు ఏ ప్రయత్నాన్ని వదలడంలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి - లక్షారెడ్డి మధ్య కూడా పోటి తీసుకురావడం వెనుక వెలమ కులానికి చెందిన వారి హస్తముందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు రేవంత్ రెడ్డిని ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డాలని అధికార తెలంగాణ రాష్ట్ర సమితీ వ్యూహాలు రచిస్తోంది. రేవంత్ రెడ్డి ఓటామే ధ్యేయంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రయత్నిస్తున్నారు. ఈ సారి శాసనసభలో రేవంత్ రెడ్డిని చూడకూడదన్నది సీఎం కేసీఆర్ పట్టుదల. దీంతో ఆయన్ని ఓడించేందుకు కేసీఆర్ సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. మొత్తానికి మహాబూబ్‌నగర్ రాజకీయం రసకందాయంలో పడింది.