తమలో తాము కొట్టుకుంటాం.. కానీ బయట నుంచి వచ్చి ఆధిపత్యం చేస్తే మాత్రం ఒప్పుకోం.. తామంతా ఒక్కటవుతాం..’ నిన్న తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి అన్న మాటలివీ.. దీన్ని బట్టి తెలంగాణ పీసీసీలో ఈ గొడవకు కారణం రేవంత్ రెడ్డి కోరికేనని స్పష్టమవుతోంది..
కొద్దిరోజుల క్రితం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని తన నివాసం కలిసి కుటుంబంతో సహా ఫొటో దిగి విడుదల చేశారు. అప్పుడే రేవంత్ కు పీసీసీ పీఠం ఖాయమైందని అంతా అనుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ కాంగ్రెస్ లో రాజకీయం పూర్తిగా మారింది.
రేవంత్ రెడ్డి సీఎం కుర్చీయే టార్గెట్ గా పావులు కదిపి పీసీసీ పీఠం అధిరోహించాలని భావిస్తున్నట్టు టీ కాంగ్రెస్ సీనియర్లు అంతా అనుమానిస్తున్నారు. అందుకే ఇన్నాళ్లు కొట్టుకున్న వాళ్లు ఇప్పుడు ఏకతాటిపైకి వచ్చి ఐక్యతరాగం ఆలపిస్తున్నట్టు పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
రేవంత్ పీసీసీ చీఫ్ అయితే ఏకు మేకు అవుతాడని.. తమకు ప్రాధన్యం ఉండదని టీపీసీసీ పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. తమ రాజకీయ భవిష్యత్ కూడా గందరగోళంలో పడుతుందని భావిస్తున్నారు. అందుకే హుజూర్ నగర్ పోటీ విషయంలో జానా - కోమటిరెడ్డి సహా అందరూ ఉత్తమ్ కే సపోర్ట్ చేయడం వెనుక కారణం ఇదేనంటున్నారు. రేవంత్ ను రాజకీయంగా ఎదగకుండా.. పీసీసీ పీఠం ఇవ్వకుండా.. తమకే ఆపీఠం దక్కేందుకే టీకాంగ్రెస్ పెద్దలు ఏకమయ్యారని అంటున్నారు. రేవంత్ పీసీసీ కోరికకు సీనియర్లు అంతా అడ్డుగా ఉన్నందునే విసుగుచెందిన రేవంత్ రెడ్డి నిరసనగళం వినిపించినట్టు కనిపిస్తోంది.
ఇలా రేవంత్ వర్సెస్ టీ కాంగ్రెస్ పెద్దల లొల్లికి ప్రధాన కారణం టీపీసీసీ పీఠమేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.