కూతురు నిశ్చితార్థానికి రేవంత్‌ వస్తాడా?

Update: 2015-06-09 06:52 GMT
వారం కిందట పొద్దున లేచి దర్జాగా తన అనుచరులతో కలిసి అసెంబ్లీకి వెళ్లాల్సిన రేవంత్‌ రెడ్డి.. ఎన్నో షరతుల మధ్య, చుట్టూ పోలీసుల పహరాతో అసెంబ్లీకి రావాల్సి వచ్చింది. ఓటుకు నోటు కేసు ఆయన జీవితాన్ని తలకిందులు చేసేసింది. ఈ కేసు ఎక్కడిదాకా వెళ్తుందో.. రేవంత్‌ రాజకీయ జీవితాన్ని చివరికి ఏ మలుపు తిప్పుతుందో కానీ.. ప్రస్తుతానికి ఆయన చాలా బాధాకరమైన పరిస్థితుల్లో ఉన్నారన్నది మాత్రం వాస్తవం. ఈ గురువారం రేవంత్‌ కూతురికి నిశ్చితార్థం జరగబోతోంది. ఆ కార్యక్రమానికి రేవంత్‌ హాజరవుతాడా లేదా అన్నది సస్పెన్స్‌గా మారింది.

రేవంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న మరుసటి రోజు నుంచి ఆయన లాయర్లు బెయిల్‌ కోసం ప్రయత్నిస్తున్నా సాధ్యం కావడం లేదు. రేపు (బుధవారం) బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరగబోతోంది. బెయిలిస్తారా లేక నిశ్చితార్థానికి హాజరు కావడానికి షరతులతో కూడిన అనుమతి ఇస్తారా అన్నది చూడాలి. కేవలం నిశ్చితార్థం వరకు అనుమతి ఇస్తే.. ఆ కార్యక్రమానికి వచ్చినపుడు రేవంత్‌, అతడి కుటుంబ సభ్యుల్లో ఎలాంటి భావోద్వేగాలు ఉంటాయో చూడాలి. మరోవైపు ఈ కష్ట కాలంలో రేవంత్‌ కుటుంబానికి అండగా నిలవాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. నిశ్చితార్థ కార్యక్రమానికి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో పాటు తెలంగాణ ముఖ్య నేతలు, ఆంధ్రప్రదేశ్‌ మంత్రులందరూ హాజరు కావాలని నిర్ణయించారు.

Tags:    

Similar News