251 రూపాయల ఫోన్ ఎలా ఉందో చూశారా..

Update: 2016-08-03 07:07 GMT
 ఫ్రీడం 251.. రింగింగ్ బెల్స్ సంస్థ 251 రూపాయలకే ఇస్తామన్న ఫోన్ ఇది.  ప్రపంచం లోనే అతి చవకైన స్మార్ట్ ఫోన్ గా ఒక్కసారిగా పాపులర్ అయి అంతేస్థాయిలో వివాదాలనూ ఎదుర్కొన్న ఈ ఫోన్  ఎట్టకేలకు వినియోగదారులకు చేరుతోంది. ఇప్పటికే 5 వేల మందికి దీన్ని డెలివరీ చేయగా తాజాగా మరో 65 వేల మందికి డెలివరీ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇలా మొత్తం 2 లక్షల మందికి డెలివరీ చేస్తామని సంస్థ చెబుతోంది.  ఇంతకీ రింగింగ్ బెల్సు ఫ్రీడమ్ 251 ఫోన్ ఎలా ఉందో ఒక్కసారి చూద్దామా..

రింగింగ్ బెల్సు కంపెనీ తొలుత చెప్పినట్లుగా ఈ హ్యాండ్ సెట్ లేదు. పూర్తీ భిన్నంగా ఉంది.  చూడ్డానికి అన్ని ఆండ్రాయిడ్ స్మార్టు ఫోన్లు మాదిరిగానే కనిపిస్తున్నా చిన్నపాటి తేడాలున్నాయి. కేవలం గ్రే - మరియు బ్లాక్ కలర్సు మాత్రమే ఉన్నాయి. ఈ ఫోన్ కు పవర్ బటన్ కుడి వైపూ - వాల్యూం రాకర్ ఎడమ వైపు ఉన్నాయి. ఛార్జింగ్  - డేటా ట్రాన్స్ ఫర్  కోసం ఉపయోగపడే మైక్రో  USB పోర్ట్ 3.5 mm జాక్ తో పైన ఉంది. నావిగేషన్ కొరకు ఆన్ స్క్రీన్ బటన్ ల బదులు కెపాసిటివ్ బటన్ లు ఇందులో ఉన్నాయి.

లావా - మైక్రో మాక్స్ - ఇంటెక్స్ వంటి మిగతా బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లతో పోల్చి చూస్తే దీని స్క్రీన్ కొంచెం డల్ గా ఉంది. కానీ హ్యాండీగా ఉంది. ఆండ్రాయిడ్ 5.1 లాలి పాప్ వెర్షన్ తో పనిచేసే దీనిలో హోం స్క్రీన్  అడుగు భాగం లో మెసేజింగ్ - వెబ్ బ్రౌజింగ్ - కెమెరా ఉన్నాయి.  తొలుత అనుకున్నట్లుగా స్వచ్చ భారత్ - ఉమన్ సేఫ్టీ - ఫార్మర్ - మెడికల్ - వాట్స్ అప్  - పేస్ బుక్ - యూ ట్యూబ్ లాంటి యాప్ లు ఇన్ బిల్ట్ గా లేవు.  రియర్ కేమేరా 3.2 MP  - 0.3 MP ఫ్రంట్ కెమెరా  ఉన్నాయి. ప్రస్తుతం మినిమం 5 ఎంపీ కెమేరాలు వాడుతున్న సమయంలో ఇది ఏ వినియోగదారుడినీ సేటిస్ఫై చేయలేదు. అయితే.. ఫ్రీడం ధర ప్రకారం చూసుకుంటే ఇది అద్భుతమైన ఫోన్ అనే చెప్పాలి.
Tags:    

Similar News