ప్రస్తుతం రోడ్ సేఫ్టీ వరల్డ్ సీరిస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సీరిస్లో పాత క్రికెటర్లు ఆడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్లో సచిన్ విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ వయసులోనూ తన జోరు, స్పీడు ఏ మాత్రం తగ్గలేదని.. తాను ఇంకా ఫుల్ స్వింగ్లోనే ఉన్నానని చెప్పకనే చెబుతున్నారు. సచిన్ ఈ సీరిస్ లో మొదటి మ్యాచ్ లో 33 నాటౌట్, ఆ తర్వాత 9, ఆ తర్వాత 60, 65, 30 ఇలా పరుగుల వరద పారించాడు. ఒక్క మ్యాచ్ లో తప్ప .. సచిన్ అన్ని మ్యాచ్ ల్లోనూ తనదైన రేంజ్లో ప్రతాపం చూపించాడు.
మరో నెలరోజుల్లో సచిన్ తన 47 వ పుట్టినరోజును జరుపుకోబోతున్నాడు. అయితే ఈ ఏజ్ లోనూ సచిన్ తన దైన స్టయిల్ లో బ్యాటింగ్ చేస్తుండటం పట్ల ప్రశంసలు దక్కుతున్నాయి.సచిన్ టెండూల్కర్ క్రికెట్ మ్యాచ్లను వదిలిపెట్టి ఇప్పటికే ఏడేళ్లయింది. అయినప్పటికీ తనదైన స్టయిల్ లో రాణించడం.. కుర్రాళ్ల తో సమానంగా ఆడటం చూసి సచిన్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. రోడ్ సేఫ్టీ సీరిస్ లో రిటైరైన క్రికెటర్లే ఆడిన మాట వాస్తవం. కానీ అందులో సగం మంది గత ఒకట్రెండు ఏళ్లలో రిటైరైన వాళ్లే ఉన్నారు. కొన్ని నెలల ముందు రిటైరైన వాళ్లు సైతం ఇందులో పాల్గొన్నారు. అయితే వాళ్లందరికంటే సచిన్ మెరుగైన ప్రదర్శన కొనసాగిస్తుండటం గమనార్హం.
38 ఏళ్ల వయసులో 2011 ప్రపంచకప్‌లో టాప్ స్కోరర్ గా నిలిచాడు సచిన్. ఇప్పుడు సైతం తన సత్తాను చాటుతున్నాడు. స్ట్రెయిట్ డ్రైవ్స్, కవర్ డ్రైవ్స్, స్వీప్ షాట్లు ఆడటం సచిన్ స్పెషాలిటీ. ప్రపంచంలోనే అత్యధిక రికార్డ్స్ సచిన్ పేరుమీద ఉన్నాయి. సచిన్ వయసు తగ్గినా మెరుపులు ఏ మాత్రం తగ్గలేదని నిరూపిస్తున్నాడు.