సుష్మ నోట రోహిత్ మాట

Update: 2016-01-31 09:21 GMT
గడిచిన రెండు వారాలుగా దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్ డీ విద్యార్థి రోహిత్ ఉదంతంపై బీజేపీ వ్యూహం మారుస్తున్నట్లు కనిపిస్తోంది. ఇంతకాలం ఈ వ్యవహారంపై ఆచితూచి వ్యవహరిస్తున్న మోడీ సర్కారు.. ఇక ఇప్పుడు అటో ఇటో తేల్చుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తోంది. రోహిత్ ఆత్మహత్య వ్యవహారంపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్సనల్ గా తీసుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో.. ఈ వ్యవహారంపై మౌనం పాటిస్తే పార్టీ పరపతికి ప్రమాదకరమన్న భావన కమలనాథుల్లో కనిపిస్తోంది.

దీనికి తగ్గట్లే ఈ వ్యవహారంపై తాజాగా కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ గళం విప్పారు. రోహిత్ అసలు దళితుడే కాదని.. తన వద్ద ఉన్న సమాచారం ప్రకారం సదరు విద్యార్థి దళితుడు కాదని.. కానీ కొందరు అతడ్ని దళితుడిగా చెబుతున్నారని మండిపడ్డారు. ‘‘సదరు విద్యార్థి దళితుడని చేస్తున్న ప్రచారం పూర్తిగా ఆధారం లేనిది’’ అని వ్యాఖ్యానించారు. బీజేపీ అగ్రనేతల్లో ఒకరైన సుష్మ ఈ వ్యవహారంపై గళం విప్పిన నేపథ్యంలో రోహిత్ ఆత్మహత్య వ్యవహారం ఏ దిశగా పయనిస్తుందన్నది ఇప్పుడు ఉత్కంటగా మారింది.
Tags:    

Similar News