జయ నాకు నిజంగా అమ్మేనన్న రోజా

Update: 2016-12-06 11:15 GMT
తమిళుల ఆరాధ్య దేవత జయలలిత అక్కడ అమ్మగా ప్రసిద్ధురాలు. అయితే... వైసీపీ ఎమ్మెల్యే రోజా.. జయ తనకు నిజంగా అమ్మలాంటివారని... తనకు అమ్మలేని లోటును జయ తీర్చారని చెప్పారు.  తన వ్యక్తిగత జీవితంలోను, రాజకీయ జీవితంలోను ఆమె పాత్ర ఎంతో ఉందని అన్నారు. తన వివాహం జయే దగ్గరుండి జరిపించిన విషయం ఆమె గుర్తు చేసుకున్నారు.
    
తన రాజకీయ ప్రవేశం సందర్భంగా ఆమె ఎంతో సహాయం చేశారని, ఎన్నో సలహాలు ఇచ్చారని అన్నారు. తాను గెలవడానికి అన్నాడీఎంకే కార్యకర్తలు పని చేయాలని ఆమె పురమాయించారని రోజా గుర్తు చేసుకున్నారు. తనకు తల్లిలేని లోటు తీర్చారని రోజా తెలిపారు. ఆమె మరణం కేవలం తమిళనాడుకే కాదని, తనలాంటి ఎంతోమందికి తీరని లోటని రోజా కన్నీటి పర్యంతమయ్యారు.
    
మరోవైపు వైసీపీ అదినేత జగన్ కూడా జయ మరణంపై సంతాపం ప్రకటించారు. పేదల కష్టాలు తెలిసిన మనసున్న నేతగా జయను కీర్తించారు. ఆమె మరణం తీరని లోటని తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News