సొంత మనుషులే ఆపదలో ఉంటే చూసేందుకు, పట్టించుకునేందుకు టైం లేని రోజులు ఇవి! కొంత బాధ అనిపించినా ఇది వాస్తవం. మనబోటివాళ్లకే ఇలా ఉంటే ప్రజాప్రతినిధులకు ఇక టైం ఎక్కడుంటుంది? ఆపదలో ఉన్న వాళ్లని ప్రత్యక్షంగా రక్షించే తీరిక వాళ్లకు ఉంటుందని ఆశించలేం. సాధారణ ప్రజానీకం ఇలానే అనుకుంటారు. కానీ, పొలిటికల్ ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న జగన్ పార్టీ వైకాపా నగరి ఎమ్మెల్యే ఆర్ కే రోజా తనలోనూ దయాగుణం ఉందని చాటి చెప్పారు.
ఆదపలో ఉన్న వ్యక్తి ని ఆదుకోవడం కనీస ధర్మంగా రోజా చెప్పకనే చెప్పింది. ప్రమాదానికి గురైన ఓ మహిళను తన కారులో ఎక్కించుకుని ఆస్పత్రికి చేర్చడమే కాకుండా వైద్యులతో మాట్లాడి బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. శుక్రవారం జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా పాకాల మండలం నేండ్రగుంట వద్ద సింధు అనే మహిళ ప్రమాదవశాత్తూ స్కూటీపై నుంచి పడిపోయింది. అదే సమయంలో రోజా కారులో అటువైపుగా వెళుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన రోజా తన కారులో సింధును పూతలపట్టు ఆస్పత్రికి తీసుకు వెళ్లారు.
సింధుకు మెరుగైన వైద్యం అందించాలని అక్కడి డాక్టర్లకు సూచించారు. కాగా సకాలంలో స్పందించి తన కారులో గాయపడిన మహిళను ఆస్పత్రికి తీసుకువెళ్లిన ఎమ్మెల్యే రోజాను స్థానికులు ప్రశంసించారు. కాగా, గతంలో కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ప్రస్తుత పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఇలానే దయాగుణం చూపారు. ఢిల్లీలోని ఓ ప్రధాన వీధిలో ప్రమాదవశాత్తు ఓ బైకర్ రోడ్డు మీద పడిపోయాడు. ఈ దారిలో వెళ్తున్న మమత ఈ విషయాన్ని గమనించి.. తన కారును ఆపి.. ఆ వ్యక్తిని కారులో ఎక్కించి ఆస్పత్రికి పంపారు. తాను మరో కారులో పార్లమెంటుకు చేరుకున్నారు. అప్పట్లో ఈ విషయం ప్రధానంగా ప్రచురణకు వచ్చింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/