ఏపీ ప్రజల కలల రాజధాని అమరావతికి కేంద్రం ఒక తీపి కబురు (?) వెల్లడించింది. ఐదు కోట్ల ఆంధ్రుల కలల రాజధానికి రైల్వే లైన్ కు పచ్చజెండా ఊపేసింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి నేరుగా ఏపీ రాజధానికి రావటానికి వీలుగా.. అమరావతి రైల్వే లైన్ కు ఓకే చెప్పేసింది. వివిధ ప్రాంతాల నుంచి నేరుగా రాజధానికి రైల్లో వచ్చేందుకు వీలుగా మూడు రైల్వే లైన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
106 కిలోమీటర్ల ట్రాక్త ఈ రైల్వే లైన్ కోసం రూ.2680 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. కేంద్రం.. ఏపీ సర్కారు ఉమ్మడి భాగస్వామ్యంలో ఈ రైల్వే లైన్ నిర్మాణం చేయనుండటం గమనార్హం. తాజా బడ్జెట్ లో అమరావతికి మూడు లైన్ల రైల్వే నిర్మాణానికి నిధులను మంజూరు చేసింది. అయితే..ఈ మొత్తం ఎంతన్నది చూస్తే మాత్రం కరెంటు షాక్ తగిలినట్లుగా ఉంటుందనటంలో సందేహం లేదు. ఆ చేదు నిజాన్ని పక్కన పెడితే.. గుంటూరుకు దగ్గర్లోని నంబూరు నుంచి అమరావతికి డబుల్ లైన్.. అదే సమయంలో నరసరావుపేట నుంచి సింగిల్ లైన్ ను నిర్మిస్తున్నారు.
మొత్తంగా నిర్మిస్తున్న మూడు కొత్త లైన్ల లెక్కను చూస్తే.. పెదకూరపాడు – అమరావతి.. సత్తెనపల్లి – నరసరావుపేటల మధ్య కొత్త సింగిల్ లైన్ వేయనున్నారు. ఇక.. డబుల్ లైన్ విషయానికి వస్తే.. నంబూరు – అమరావతి – ఎర్రుపాలెం మార్గం ఉత్తర.. దక్షిణ భారతావనికి అమరావతి కొత్త లైన్ ప్రత్యామ్నాయం కానుంది. చాలారైళ్లు విజయవాడకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. అమరావతి నుంచి నేరుగా ఢిల్లీ.. చెన్నై.. హైదరాబాద్ లకు వెళ్లొచ్చు. అయితే.. ప్రాక్టికల్ గా ఇదెంత వరకూ సాధ్యమవుతుందో చూడాల్సిందే. ఇక.. ఈ మూడు రైల్వే లైన్లకు అయ్యే ఖర్చు లెక్కల్ని చూస్తే.. ఎర్రుపాలెం – అమరావతి – నంబూరుకు రూ.2068.98 కోట్లు.. అమరావతి – పెదకూరపాడు రూ.300.40కోట్లు.. సత్తెనపల్లి – నరసరావు పేట లైన్ కు రూ.310.21 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. మొత్తంగా నాలుగేళ్లలో ఈ కొత్త రైల్వే లైన్లను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇదంతా చదివినప్పుడు అమరావతికి మూడు రైల్వే లైన్లు.. కొత్తగా పలు స్టేషన్లు.. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అమరావతికి నేరుగా రైళ్లు వచ్చేయటం లాంటి సినిమాలు వరుసగా కనిపిస్తాయి. అయితే.. ఇదంతా సాకారం అయ్యే దగ్గరే అసలు విషయం ఉంది. ఇప్పటికి ఉన్న అంచనాల ప్రకారమే ఈ కొత్త రైల్వే లైన్లు పూర్తి కావటానికి నాలుగేళ్ల సమయం పడుతుందని. ఇందుకోసం వేలాది కోట్లు ఖర్చు అయ్యే పరిస్థితి. ఏపీ మీద ఇంత ప్రేమే ఉన్నప్పుడు.. ఈసారి బడ్జెట్ లో కొత్త రైల్వే లైన్లకు సంబంధించిన సర్వే కోసం కేవలం రూ.కోటి మాత్రమే కేటాయించటం చూస్తే అసలు విషయం ఇట్టే అర్థం కాక మానదు. ఓపక్క ఏపీ సర్కారు నిధుల కోసం కటకటలాడే వేళ.. కొత్త రైల్వే లైన్ల కోసం ఏకంగా రూ.1400 కోట్ల మేర ఖర్చు చేయాల్సి రావటం సాధ్యమేనా? అన్నది అసలు ప్రశ్న. పేపర్ల మీద చెప్పుకోవటానికి.. మీడియాలో భారీగా ప్రచారం చేసుకోవటానికి పనికి వచ్చే ఇలాంటి ప్రతిపాదనలు సాకారం కావటానికి ఏళ్లకు ఏళ్లు పడుతుందన్న చేదు నిజాన్ని అస్సలు మర్చిపోకూడదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/