ఆరెస్సెస్ ప్యాంటేస్తోంది!!

Update: 2016-03-11 07:23 GMT
 ఆరెస్సెస్... అంటే ఎవరికైనా వెంటనే కళ్ల ముందు ఖాకీ నిక్కరు - చేతిలో కర్ర కనిపిస్తాయి. కానీ, ఇక నుంచి ఆరెస్సెస్ కార్యకర్తలు ఆ వేషధారణలో కనిపించరట. ఆరెస్సెస్ యూనిఫాం మారుతోందట. మోకాళ్ల వరకు ఉండే ఖాకీ నిక్కర్ల స్థానంలో ప్యాంట్లు వస్తాయని తెలుస్తోంది. అంతేకాదు.... ఆ ప్యాంట్లు కూడా ఖాకీ రంగులో కాకుండా బూడిద లేదా నీలిరంగులో ఉండొచ్చు.
   
రాజస్థాన్ లో శుక్రవారం నుంచి జరుగుతున్న మూడు రోజుల ఆరెస్సెస్ సదస్సులో ఈ నిర్ణయం ప్రకటించే సూచనలున్నాయి. ఆరెస్సెస్ లో పలువర్గాలు ఈ యూనిఫాం మార్పిడి అంశాన్ని ఎప్పటి నుంచో తెరపైకి తెస్తున్నాయి. నిక్కర్లు కాకుండా ప్యాంట్లు కావాలని ఎప్పటినుంచో కోరుతున్నారు. కానీ, ఇంతవరకు ఇది అజెండాలో పెట్టి చర్చించిన దాఖలాలు లేవు. కానీ, తొలిసారిగా ఈసారిగా ఈ యూనిఫాం మార్పు అంశాన్ని అజెండాలో చేర్చారు. కార్యకర్తల అభిప్రాయం తెలుసుకున్నాక దాని ప్రకారం దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఆరెస్సెస్ పెద్దలు ఇప్పటికే వెల్లడించారు.
   
కాగా ఆరెస్సెస్ కు ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. సుమారు 90 సంవత్సరాలకు పైగా సేవలందిస్తున్న ఈ సంస్థ ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో సేవకులను కలిగిన సంస్థగా గుర్తింపు పొందింది.
Tags:    

Similar News