దశాబ్దాల తరబడి తనకున్న మార్క్ ను తొలిగించే ప్రయత్నంలో భాగంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అలియాస్ ఆర్ఎస్ఎస్ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. సంఘ్ పేరు చెప్పిన వెంటనే ఖాకీ నిక్కరు.. చేతిలో కర్ర పట్టుకొనే చిత్రం ఇకపై సమూలంగా మారనుంది. ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే.. ఆర్ఎస్ఎస్ సమావేశాల్లో నిక్కరును ధరించాల్సిందే. ఆ కఠిన నియమాన్ని మార్చటమే కాదు.. యూనిఫాం విషయంలో సమూల మార్పులకు తాజాగా నిర్ణయం తీసుకున్నారు.
91 ఏళ్లుగా తమ ట్రేడ్ మార్క్ గా సాగుతున్న ‘‘నిక్కర్’’కు తాజాగా చెల్లుచీటి చెప్పేశారు. ప్రస్తుతం ధరిస్తున్న ఖాకీ నిక్కరు స్థానే.. గోధుమరంగు ప్యాంటునను ధరించాలన్న నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా సంఘ్ ప్రకటించింది. రాజస్థాన్ లో గత మూడు రోజులుగా సాగుతున్న సంఘ్ మేదోమధన సదస్సు ఆదివారం ముగిసింది. ఈ సందర్భగా సంఘ్ ప్రధాన కార్యదర్శి భయ్యాజీ మాట్లాడుతూ.. తమ డ్రెస్ కోడ్ మారుస్తూ నిర్ణయం తీసుకున్నామని..ఇదే పెద్ద నిర్ణయంగా వెల్లడించారు.
కాలంతో పాటు మారతామని.. మారకపోతే ఏ సంస్థ కూడా పురోగతి సాధించలేదని చెప్పిన ఆయన.. యువను ఆకర్షించేందుకు వీలుగా డ్రెస్ కోడ్ ను నిక్కరు స్థానే.. ఫ్యాంటులోకి మార్పు చేసినట్లు పేర్కొన్నారు. గోధుమ రంగును ఎంపిక చేయటానికి ప్రత్యేక కారణం ఏమీ లేదని.. చూసేందుకు బాగుంటుందన్న ఉద్దేశంతోనే ఆ రంగును ఎంపిక చేసినట్లుగా చెప్పారు. గోధుమ రంగు ప్యాంటు అందుబాటులో ఉండటంతో పాటు.. చూసేందుకు బాగుంటుందని.. యూత్ ను ఆకర్షించి.. సభ్యత్వాలు పెంచాలన్నది తమ ఉద్దేశంగా చెప్పారు. మరి.. నిక్కరు నుంచి ఫ్యాంటులోకి మారిన సంఘ్.. వారు కోరుకున్నట్లు యూత్ ఆ సంస్థలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేస్తారా? అన్నది కాలమే చెప్పాలి.