చైనాకు పందులని ఎగుమతి చేస్తున్న రష్యా ...ఇదే కారణం !

Update: 2020-06-12 15:00 GMT
చైనీయులకు పంది మాంసం కష్టాలొచ్చాయి. రోజువారి డైట్‌‌‌‌ లో పంది మాంసం‌‌‌‌ లేనిదే ముద్ద దిగని చైనీయులు మాంసం దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. చైనాలో ఆఫ్రిక‌న్ స్వైన్ ఫీవ‌ర్ బీభ‌త్సం సృష్టించడంతో చైనాలో పందుల కొరత విపరీతంగా పెరిగింది. ఇది ఇప్పుడు రష్యాకి సువర్ణ అవకాశంగా మారింది. ఈ మహమ్మారి కారణంగా విమానయాన రంగం కుదైలైంది. అయితే చైనాలో ఏర్పడిన పందుల కొరతతో రష్యాకు చెందిన విమానయాన సంస్థకు మంచి గీరాకీ వస్తోంది.

ఓల్గా-డీఎన్‌ ఈపీఆర్ ‌కు చెందిన వాణిజ్య విమానాల్లో ఈ ఏడాది ఫ్రాన్స్‌ నుంచి చైనాకు దాదాపు 3000 పందులు సరఫరా చేశారు. 10380 కిలోమీటర్ల దూరం నుంచి చెక్క డబ్బాల్లో ఉంచిన పందులను బోయింగ్‌ 747 కార్గో విమానాల్లో సరఫరా చేస్తున్నారు. అమెరికా నుండి ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లో చైనా మొత్తం 254,533 టన్నుల పంది మాంసాన్ని దిగుమతి చేసుకుంది. దీంతో యూరప్ ‌ను అధిగమించి చైనా అతిపెద్ద పంది మాంసం సరఫరాదారుగా అవతరించింది. ఇది ఇప్పటికే 2019 ఏడాది మొత్తానికి చైనా కొనుగోలు చేసిన 245,000 టన్నుల కంటే ఎక్కువ.

ఎన్నడూ లేనన్ని సవాళ్లను ప్రపంచ విమానయానరంగం ప్రస్తుతం ఎదుర్కొంటుంది. కానీ కార్గో క్యారియర్‌లకు ఇదొక సువర్ణ అవకాశం అని ఓల్గా-డీఎన్‌ ఈపీఆర్‌ గ్రూప్‌ ప్రెసిడెంట్‌ ఇసైకిన్‌ అన్నారు. ఇంతకుముందు, అన్ని ప్రయాణికుల విమానాల్లో సగానికి పైగా కంపార్ట్‌ మెంట్లలో సమానులు తీసుకువెళ్లేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సరఫరా తగ్గడంతో, కార్గో విమానయాన సంస్థలకు డిమాండ్ పెరిగింది. వైరస్ వ్యాప్తి తరువాత, మేము చైనా వైద్య పరికరాలను ఆఫ్రికాకు పంపించడం ప్రారంభించాము. లాటిన్ అమెరికా నుండి కూడా మా సేవల కోసం విచారిస్తున్నారు. తదుపరి స్థానంలో భారత్‌ కూడా ఉంటుందని ఆశిస్తున్నాను అని ఇసైకిన్ తెలిపారు.
Tags:    

Similar News