కరోనా వైరస్ సోకిన వారిలో వీర్యకణాల సంఖ్య తగ్గుతున్నట్లుగా రష్యాకు చెందిన పరిశోధకులు గుర్తించారు. ఇది వంధ్యత్వానికి (ఇన్ ఫర్టిలిటీ) దారితీసే ప్రమాదం లేకపోలేదని రష్యా పరిశోధకులు వెల్లడించారు. కరోనా బారిన పడ్డ వారిలో వ్యంధత్వ సమస్య అధికంగా ఉందని గుర్తించామని తెలిపారు.
కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారిలో 38శాతం వీర్యకణాల సంఖ్య తగ్గినట్లుగా రష్యా పరిశోధకులు గుర్తించారు. ఇది ఆందోళన కలిగిస్తున్న అంశమని తెలిపారు. వీర్యకణాల్లోకి కూడా వైరస్ చొచ్చుకుపోతున్నట్లుగా అధ్యయనం వెల్లడించింది.
కరోనా వైరస్ వృషణాలను పాక్షికంగా దెబ్బతీసే అవకాశం ఉన్నట్లుగా చైనా-అమెరికా గతంలో నిర్వహించిన ఓ అధ్యయనంలో తెలిపింది.
రష్యాలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. గురువారానికి కేసుల సంఖ్య 6,61,165కు చేరింది. గురువారం ఒక్కరోజే 6760 కేసులు నమోదయ్యాయి. గురువారం 147మంది చనిపోయారు.