ఏడు నెలలుగా ఉక్రెయిన్ పై బాంబులతో విరుచుకుపడుతున్న రష్యాకు గడ్డు పరిస్ధితులు ఎదురవుతున్నాయా ? తాజా సమాచారం ప్రకారం అవుననే అనిపిస్తోంది. ఉక్రెయిన్లోని వివిధ నగరాల్లో రష్యా సైనికులు క్యాంపులు వేస్తున్నారు.
యుద్ధంలో ఒక్కో నగరాన్ని నాశనం చేసేస్తు వాటిని రష్యా తన ఆధీనంలోకి తెచ్చుకుంటోంది. ఈ నేపధ్యంలోనే జపోరోఘీ ప్రాంతంలోని వసిలియేవ్కా గ్రామంలో కొందరు రష్యా సైనికులకు హఠాత్తుగా తీవ్రమైన అనారోగ్యం చేసిందట.
వెంటనే అక్కడ విధుల్లో ఉన్న సైనికులను మరికొందరు సైనికులు ఆసుపత్రుల్లో చేర్చారు. వాళ్ళకి చికిత్స ప్రారంభించిన డాక్టర్లు అనుమానంతో రక్త పరీక్షలు చేశారు. దాంతో కొందరు సైనికుల రక్తంలో విషాన్ని డాక్టర్లు కనుక్కున్నారని రష్యా ఆరోపిస్తోంది.తమ సైనికుల్లో కొందరిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆధ్వర్యంలోని కొందరు వ్యక్తులు విషప్రయోగం చేసినట్లు రష్యా తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది. రక్త పరీక్షల రిజల్ట్సును రసాయన ఆయుధాల నిషేధ సంస్ధకు పంపటానికి రష్యా రెడీ అవుతోంది.
బోటులినమ్ టాక్సిన్ అనే అత్యంత ప్రమాదకరమైన విషం సైన్యం రక్తంలో బయటపడిందట. ఈ విష ప్రయోగం వల్ల బాధితుల్లో వెంటనే కండరాల సమస్యలు వచ్చి మొత్తం శరీరమంతా చచ్చుపడిపోతుంది. ఈ విషాన్ని గనుక ప్రయోగిస్తే చాలా కొద్దిరోజుల్లోనే ఎక్కువమంది చనిపోయే ప్రమాదముంది.
ఇదే సమయంలో విషప్రయోగం జరిగిందని వెంటనే గుర్తించినా, వైద్య సదుపాయాలున్నా రోగులు దీర్ఘకాలం పాటు ఆసుపత్రుల్లో ఉండాల్సిందే. అత్యుత్తమ వైద్యం గనుక అందితే బతికి బట్టకట్టిన బాధితులు కూడా ఉన్నారు. అయితే ఇలా బతికిన వాళ్ళ సంఖ్య తక్కువనే చెప్పాలి.
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి దిగటం ద్వారా దాదాపు దేశం మొత్తాన్ని నాశనం చేసిందనే చెప్పాలి. ఒక్కనగరం కూడా చెక్కుచెదరకుండా ఉందని చెప్పటానికి లేదు. ఇదే సమయంలో లక్షల సంఖ్యలో జనాలు ఉక్రెయిన్ వదిలేసి పొరుగు దేశాలైన ఇటలీ, రుమేనియా లాంటి దేశాలకు పారిపోయారు. బహుశా ఆ కసితోనే ఉక్రెయిన్ విషప్రయోగం ద్వారా రష్యాను ఎదుర్కోవాలని డిసైడ్ అయ్యిందేమో.