ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కింగ్ మేకర్ ను అంటూ కొద్దిరోజులుగా అన్ని పార్టీలతో బేరం ఆడుతూ హల్ చల్ చేస్తున్నాడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అని ఆ జిల్లాలో ఓ టాక్ నడుస్తోంది. ఈయన కోసం బీజేపీ, కాంగ్రెస్ లు ఏకంగా మనుషులను పంపి చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తుండడంతో కొండెక్కి కూర్చుంటున్న ప్రచారం సాగుతోంది. బీఆర్ఎస్ ను కాలదన్ని వైఎస్ షర్మిలకు హ్యాండ్ ఇచ్చి ఏ పార్టీలో చేరుతాడో చెప్పకుండా సీట్ల కోసం బేరమాడుతున్న పొంగులేటి తీరుపై ఆ ఖమ్మం నేతలే అసహనం వ్యక్తం చేస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఖమ్మం జిల్లాలో గెలవనివ్వనని.. అసెంబ్లీలోకి ఆ పార్టీ ఎమ్మెల్యేలను వెళ్లనివ్వనంటూ శపథం చేసిన పొంగులేటిపై ఒక్కొక్కరూ బయటకొచ్చి మరీ బీఆర్ఎస్ నేతలు మాటల దాడి చేస్తున్నారు. నిన్న బీఆర్ఎస్ మంత్రి పువ్వాడ అజయ్ ఈ మంగమ్మ శపథాలు నడవవు.. పదికి పది స్థానాలు గెలుస్తామంటూ సవాల్ చేశారు. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సైతం పొంగులేటి పొంగులు ఇక్కడ నడవవు అంటూ ఎద్దేవా చేశారు.
పొంగులేటి వెంట తిరిగేవారు ఉదయం ఆయన వెంట ఉండి సాయంత్రం వేరే పార్టీ నేతలతో తిరుగుతున్నారని.. పొంగులేటి గుడ్డిగా నమ్మి భ్రమ పడుతున్నాడని సండ్ర వెంకటవీరయ్య సెటైర్లు వేశారు. పొంగులేటితో తిరిగి ప్రతి ఒక్కరూ తనవాళ్లు కాదని.. ఈ విషయం పొంగులేటి తెలుసుకోవాలంటూ చురకలంటించారు.
పొంగులేటి తెలంగాణ ప్రజల కోసం చేసిన మంచి పని ఏంటి అంటూ సండ్ర నిలదీశారు. చౌకబారు విమర్శలు చేసే వారిని ప్రజలు విశ్వసించరని పొంగులేటికి స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి రాకముందు పొంగులేటి చరిత్ర ఏమిటి? ఇప్పుడు పొంగులేటి పరిస్థితి ఏంటి అన్నది ప్రజలకు బాగాతెలుసు అని అన్నారు.
ఖమ్మం జిల్లాలో ఏ అభివృద్ధి చేయని పొంగులేటికి ప్రజలు ఎందుకు ఓటు వేస్తారంటూ సండ్ర ప్రశ్నించాడు. కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న నిన్ను ప్రజలు గమనిస్తున్నారని సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో విమర్శలే ధ్యేయంగా పనిచేస్తున్న వారిని, అహంకారపూరితంగా మాట్లాడే వారిని ఓటేసి గెలిపిస్తారా? చెప్పాలని ప్రజలను ప్రశ్నించారు. పొంగులేటికి రాజకీయ విధానం తెలియదని ఎద్దేవా చేశారు.
రెండు జాతీయ పార్టీలు పొంగులేటి వైపు చూడడం లేదని.. నువ్వే వాళ్ల వైపు చూస్తున్నావ్ అంటూ సండ్ర పేర్కొన్నాడు. ఇక ఆ పార్టీలు నీకు మద్దతు ఇస్తాయా? అనేది కూడా తెలియాల్సి ఉందని.. ఆ పార్టీల విధానాలు కూడా ప్రజలు గమనిస్తున్నారని సండ్ర చెప్పుకొచ్చారు.
ఇన్నాళ్లు తనకే బలం ఉందని రెచ్చిపోతూ విమర్శలు చేస్తున్న పొంగులేటిపై ఇప్పుడు బీఆర్ఎస్ మాటల దాడి మొదలైంది. దీన్ని పొంగులేటి ఎలా కాచుకుంటాడన్నది వేచిచూడాలి.