ఏపీ సీఎం చంద్రబాబునాయుడు - తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఒకే వేదికపై కనిపించారు. గుజరాత్ లోని గాంధీ నగర్ లో జరిగిన అంతర్జాతీయ టెక్స్ టైల్ సమ్మిట్ 2017 లో వీరిద్దరూ పాల్గొన్నారు. కేంద్ర జౌళి శాఖ మంత్రి శాఖ మంత్రి స్మ్రతీ ఇరానీతో ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఫాబ్రిక్ టు ఫ్యాషన్ అనే థీమ్ తో ఈ కార్యక్రమం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ - తెలంగాణలో టెక్స్‌టైల్ పరిశ్రమ అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలను గురించి చంద్రబాబు - కేటీఆర్ క్లుప్తంగా మాట్లాడారు. వరంగల్ వద్ద కొత్తగా నిర్మించిన టెక్స్ టైల్ పార్కు వద్ద పర్యావరణ వ్యవస్థ గురించి అరవింద్ గ్రూప్ ఎండీ మరియు చైర్మన్ సంజయ్ లాల్ భాయ్ కు కేటీఆర్ వివరించారు.
ప్రసంగించే సమయంలో కేటీఆర్ కొంత అసౌకర్యానికి గురయ్యారు. ఆ తర్వాత సంజయ్ మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తారు. చాలా సంవత్సరాల క్రితం తాను చంద్రబాబును కలిశానని, బహుశ నేను ఆయనకు గుర్తుండకపోవచ్చని అన్నారు. కానీ, చంద్రబాబు పరిపాలనా దక్షత అంటే తనకు చాలా ఇష్టమని సంజయ్ తెలిపారు. ఈ సందర్భంతో కేటీఆర్ కల్పించుకొని మిమ్మల్ని ఎవరూ మర్చిపోరని సంజయ్ ను ఉద్దేశించి అన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/