బస్సు.. కారు..ఢీ.. పోస్టు చదివారా కేసీఆర్?

Update: 2019-10-13 05:19 GMT
సోషల్ మీడియా ఎంట్రీ పుణ్యమా అని కొత్త కొత్త ఆలోచనలే కాదు.. పలువురు ఆలోచించని యాంగిల్స్ ను కొందరు తెర మీదకు తీసుకురావటమేకాదు.. కొత్త చర్చకు కారణమవుతున్నారు. గడిచిన ఏడు రోజులుగా జరుగుతున్న తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక పోస్టు వైరల్ గా మారింది. ఆర్టీసీని ప్రభుత్వంలో కలపాలంటూ ఉద్యోగులు చేస్తున్న సమ్మెపై ప్రజలు గుర్రుగా ఉన్నారని.. సమ్మెను సామాన్యులు  వ్యతిరేకిస్తున్నట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్  పదే పదే చెబుతున్నారు.

తెలంగాణ సీఎం మాటలు ఇలా ఉంటే.. సోషల్ మీడియాలో కానీ.. వాట్సాప్ గ్రూపుల్లో కానీ విషయం మరోలా ఉంది. కేసీఆర్ సర్కారు తీరును తప్పు పడుతూ.. పలు వీడియోలు హడావుడి చేస్తున్నాయి. ఆర్టీసీ ఉద్యోగులను ఉద్దేశించి.. ఉద్యమ సమయంలో కేసీఆర్ చెప్పిన మాటల వీడియో అదేపనిగా వైరల్ అవుతోంది.

వివిధ సందర్భాల్లో ఆర్టీసీ ఉద్యోగులపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు.. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యోగుల విషయంలో తానేం చేయనున్నాన్న విషయం మీద అదే పనిగా పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే..తాజాగా ఒక పోస్టు అందరిని ఆకర్షిస్తోంది. ఆ పోస్టు సారాంశం ఏమంటే.. బస్సు వెళ్లి కారును ఢీ కొట్టినా.. కారు వెళ్లి బస్సును ఢీ కొట్టినా.. చివరకు నష్టం జరిగేది కారుకే అంటూ పెట్టిన పోస్టు ఇప్పుడు అదే పనిగా షేర్ అవుతోంది.

ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో కార్మికుల బస్సు.. అధికార పక్ష అధినేత కేసీఆర్ గుర్తు కారును పోలుస్తూ చేసిన ఈ పోలికను కేసీఆర్ చదివితే.. తత్త్వం బోధ పడుతుందని చెబుతున్నారు. అయితే.. పవర్ చేతిలో ఉన్న కేసీఆర్.. 50వేల మంది ఉద్యోగుల్లో పెల్లుబుకుతున్న నిరసన.. వారికి ప్రజల్లో పెరుగుతున్న సానుభూతిని కేసీఆర్ సర్కారు మిస్ అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News