ముందుగానే మన్నించమని కోరుతూ.. ఒక ముతక సామెతను ప్రస్తావిస్తున్నాం. ఎందుకంటే.. గౌరవ లోకేశ్ బాబు గారు చేస్తున్న తప్పుల్ని కళ్లకు కట్టినట్లుగా చెప్పాలంటే ఈ పాత సామెత అచ్చు గుద్దినట్లుగా సరిపోతుంది. అంతేకానీ.. చినబాబు అంటే మాకు ఎలాంటి చులకన భావం లేదు సుమి. ఇంతకీ.. ఆ సామెత ఏమంటే.. కొత్త బిచ్చగాడు పొద్దురెగరన్న చందంగా మారింది లోకేశ్ యవ్వారం.
అధికారంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే జరిగే లాభం ఏమిటో గుర్తించని.. ఆయన పవర్ పోయాక కానీ తత్త్వం బోధ పడలేదు. అలా అని ఇష్టం వచ్చినట్లుగా ట్వీట్లు చేసినా ప్రయోజనం కలుగకపోగా.. ప్రతికూలత ఏర్పడుతుందన్న చిన్న విషయాన్ని ఆయన మిస్ అవుతున్నారు. జనాల్లో సోషల్ మీడియా జనాలు కాస్త వేరన్న విషయాన్ని లోకేశ్ గుర్తిస్తే మంచిది. ఎందుకిందంతా అంటే.. ఇటీవల సోషల్ మీడియా టీంను మార్చేసిన బాబు అండ్ కో.. ప్రతి చిన్నదానికి చెలరేగిపోవాలన్న ఆజ్ఞను జారీ చేసినట్లుగా కనిపిస్తోంది.
ఈ ఉత్సాహంలో అత్యుత్సాహపు ట్వీట్ చేశారు చినబాబు. అదేమంటే.. సభను జరగనీయకుండా.. ప్రతి దానికి అడ్డు పడుతున్న ముగ్గురు తెలుగు తమ్ముళ్లను ఏపీ అసెంబ్లీ సస్పెన్షన్ వేటు వేశారు. దీనిపై చినబాబు తన సోషల్ మీడియా ఖాతాలో రియాక్ట్ అయ్యారు. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడిని మార్షల్స్ తీసుకొస్తున్న ఫోటోను పోస్ట్ చేసిన ఆయన.. ప్రజల పక్షాన నిలిచిన నాయకులకు రాజన్న రాజ్యంలో పరిస్థితి ఇదంటూ ట్వీటారు.
అరే.. మన చినబాబు భలే ట్వీటారుగా. పంచ్ అదిరిందని సంతోషపడితే మొదటికే మోసం వస్తుంది. ఎందుకంటే.. విపక్షాలపై సస్పెన్షన్ వేటు వేసేదే ప్రజల పక్షాన నిలిచినందుకే అని డిసైడ్ అయితే.. ఐదేళ్ల నాన్నారి పాలనలో ఎంతమంది వైఎస్సార్ కాంగ్రెస్ నేతల్ని.. ఎంత టోకుగా సస్పెన్షన్ వేటు వేశారో తెలిసిందే. అంటే.. అప్పట్లో ప్రజల పక్షాన నిలిచిన దానికి చంద్రన్న రాజ్యంలో వేటు పడిందా? అదే నిజమైతే.. పవర్లో ఉన్నప్పుడు బాబు ఎంత పెద్ద తప్ప చేసినట్లు? లాంటి క్వశ్చన్లు రావటం ఖాయం.
ఇలాంటి ట్వీట్లతో అదనపు ప్రయోజనం కలుగకపోగా.. కొత్త విమర్శల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. చినబాబు అంటే.. అంత దూరం ఆలోచించలేరనుకుందాం.. అంతమంది తమ్ముళ్లు ఉండి కూడా సరైన రీతిలో సలహాలు ఇవ్వకుంటే ఎట్లా? చేతిలో ఉంది కదా? అని అదే పనిగా ట్వీటితే.. తిప్పలే అన్న విషయాన్ని లోకేశ్ తమ్ముడు ఎప్పటికి గుర్తిస్తారో?