గల్ఫ్ దేశాల్లో కలకలం చోటుచేసుకుంది. సౌదీ అరేబియా సారథ్యంలోని సంకీర్ణ సేనలు యెమెన్‌లోని షియా తిరుగుబాటుదారుల నివాస స్థలాల్లో జరిపిన వైమానిక దాడులు జరిపిన రెండు రోజులకే...యెమన్ నుంచి దేశ రాజధాని రియాద్‌పైకి క్షిపణి దూసుకువచ్చింది. అయితే ఈ క్షిపణి ని సౌదీ అరేబియా కూల్చివేయగా..క్షిపణి శకలాలు రియాద్ అంతర్జాతీయ విమానశ్రయంలో పడ్డాయి. ఈ క్షిపణి దాడికి తామే పాల్పడినట్లు షియా-సున్నీలు ఏర్పరచిన మతపరమైన రాజకీయ శ్రేణుల అయిన ఇరాన్ మద్దతు కలిగిన షితే హుతి రెబెల్స్ ప్రకటించుకున్నాయి.
సౌదీ అరేబియా అధికార వర్గాల ప్రచారం ప్రకారం జనావాస ప్రాంతాలను టార్గెట్ చేసుకుని భారీ ప్రాణం నష్టం కల్గేలా యెమన్ నుంచి మిస్సైల్ దాడి జరిగింది. 1,200 కిలోమీటర్ల దూరం నుంచి ఈ మిస్సైల్‌ను ప్రయోగించారని..అయితే తాము సరైన రీతిలో తిప్పికొట్టామని వివరించారు. అయితే ఈ క్షిపణి కూల్చివేత వల్ల కింగ్ ఖలీద్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు ఆవరణలో భారీ పేలుడు శబ్దం వినిపించింది. అయితే ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
కాగా, గతవారం సౌదీ అరేబియా సారథ్యంలోని సంకీర్ణ సేనలు జరిపిన దాడుల్లో యెమెన్‌కు చెందిన 29 మంది మృతి చెందారు. వారలో పలువురు పిల్లలు కూడా ఉన్నారని యెమెన్ ఆరోగ్యశాఖ అధికారి అబ్దెల్లా అల్ ఎజీ తెలిపారు. ఈ దాడుల్లో 28 మంది గాయపడ్డారు. ఈ దాడిలో సౌదీ అరేబియా సరిహద్దుల్లోని సదా పట్టణంలోని హోటల్ ధ్వంసమైంది. సదరు హోటల్‌లో తిరుగుబాటుదారులు లేరని ప్రత్యక్ష సాక్షి అహ్మద్ మహమ్మద్ తెలిపారు. ఇది అమెరికా, సౌదీ అరేబియా దూకుడుకు నిదర్శనమని యెమన్ ప్రతినిధులు ఆరోపించారు. దీనిపై సౌదీ సారథ్యంలోని సంకీర్ణ సేనలు ప్రతిస్పందించలేదు.