కరోనాకి ఖంగు తినిపించే జపాన్ ట్రీట్మెంట్ !

Update: 2020-08-25 01:30 GMT
కరోనా ప్రపంచాన్ని భయపెడుతుంటే ..జపాన్ మాత్రం తన ట్రీట్మెంట్ తో ఏకంగా కరోనానే భయపెట్టాలని చూస్తుంది. అదేంటి కరోనా ఏమైనా వ్యక్తి , జంతువు కాదు కదా , వాళ్లు భయపెట్టడానికి అని అనుకుంటున్నారా ! మీరు అనుకున్నది నిజమే కానీ ,అక్కడే ఓ ట్విస్ట్ ఉంది. అదేమిటి అంటే .. ప్రస్తుతం కరోనా వైరస్ ను కట్టడిచేసేందుకు ప్రపంచమంతా ఓ పెద్ద యుద్ధం చేస్తోంది. అయితే జపాన్ మాత్రం కరోనా ట్రీట్మెంట్ లోనూ తన ప్రత్యేకతను చాటుతోంది. ఈ వ్యాధి సోకిన వ్యక్తులు భయంతో ప్రాణాలు పోగొట్టుకోవడాన్ని సెంట్రలైజ్ చేసింది. అంతే.. భయాన్ని పోగొట్టే ఆలోచన చేసి ఒక సంస్థ ‘స్కేర్ స్క్వాడ్’ అనే షోకి శ్రీకారం చుట్టింది.

ఈ స్కేర్ స్క్వాడ్ షో 15 నిమిషాల సేపు ఉంటుంది. ఇందులో భాగంగా కస్టమర్ ను శవపేటికలో పడుకోబెడతారు. ఆ పెట్టెలో భయానక అరుపులు..ఆహాకారాలు.. ఇలా రకరకాలుగా అతన్ని భయపెడుతుంటారు. అంతేకాదు, మధ్యమధ్యలో దెయ్యాల వేషాలతో .. బాక్స్ విండో తీసి మరీ భయపెట్టి లోపల ఉన్న వాళ్లని పీక్ స్టేజ్ కు తీసుకెళ్తుంటారు. అంతే ఆ కరోనా బాధితుడు కరోనా విషయాన్నే మర్చిపోతాడనేది షో ఆర్గనైజర్ల ఆలోచన. ఏదేదో బాగుంది కదా .. అయితే ఈ షో టిక్కెట్ ఎంతంటే.. 8 అమెరికన్ డాలర్లు. అంటే మన కరెన్సీ లో దాదాపు ఆరు వందల రూపాయలు.
Tags:    

Similar News