గూగుల్‌.. ఇంట్లో మ‌ద్యం త‌యారు చేయ‌డం ఎలా?

Update: 2020-04-16 13:30 GMT
హుషారు సినిమా చూశారుగా.. మ‌ద్యం ల‌భించ‌క యువ‌కులు తామే బీరు త‌యారుచేయాల‌ని ప్లాన్ వేసి అతిక‌ష్టం మీద త‌యారు చేస్తారు. అతిక‌ష్ట‌మ్మీద త‌యారుచేసి విజ‌యం పొందుతారు. అయితే వారు ఆ బీర్ త‌యారీని ఉపాధి కోసం చేయ‌గా.. ప్ర‌స్తుతం ఇళ్ల‌ల్లో ప్ర‌జ‌లు త‌మ దాహం తీర్చుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారంట‌. సేమ్ హుషారు సినిమా మాదిరి ప్ర‌స్తుతం లాక్‌డౌన్ నేప‌థ్యంలో కొంద‌రు త‌మ ఇళ్ల‌ల్లో మ‌ద్యం త‌యారు చేయ‌డానికి విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారంట‌. ఆ త‌యారీ గురించి సెర్చ్ ఇంజ‌న్ గూగుల్‌ను ఆశ్ర‌యిస్తున్నారంట‌. ఇంట్లో మ‌ద్యం త‌యారు చేయ‌డం ఎలా? అని గూగుల్‌లో వెతుకుతున్నారు. లాక్‌డౌన్‌తో మ‌ద్యం దుకాణాలు బంద్ కావ‌డంతో ఈ విధంగా మందుబాబులు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారంట‌.

ప్ర‌స్తుతం రెండో ద‌శ లాక్‌డౌన్ కూడా విధించారు. ప‌క్కాగా లాక్‌డౌన్ కొన‌సాగుతుండ‌డంతో ఎక్క‌డా మ‌ద్యం విక్ర‌యాలు కొన‌సాగ‌డం లేదు. సాధార‌ణ రోజుల్లో కూడా బ్లాక్‌లో విక్ర‌యించే వారు ఇప్పుడు వారు కూడా క‌రువ‌య్యారు. దీంతో మందు లేక మందుబాబులు క‌ష్టాలు ప‌డుతున్నారు. మ‌ద్యానికి వ్య‌స‌నంగా చేసుకున్న‌వారి మాన‌సిక ప‌రిస్థితి గ‌తి త‌ప్పింది. వింత వింత‌గా ప్ర‌వ‌ర్తిస్తూ పిచ్చోళ్ల మాదిరి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. వీటిని ప్ర‌సార మాధ్య‌మాల్లో చూసిన కొంద‌రు మందుబాబులు త‌మ‌కు అలాంటి ప‌రిస్థితి ఏర్ప‌డుతుంద‌నే భ‌యంతోపాటు నాలుక లాగేస్తుండ‌డంతో ఇంట్లోనే మ‌ద్యం త‌యారు చేయాల‌ని భావిస్తూ నెట్‌లో వెతికారు. ఈ మేర‌కు గూగుల్ ఇంట్లో మ‌ద్యం త‌యారీ చేయ‌డం ఎలా ప్ర‌శ్నిస్తూ గూగుల్‌లో వ‌చ్చే స‌మాధానాల‌ను చ‌దివి ఆ మేర‌కు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

ఈ క్ర‌మంలో మార్చి 22వ తేదీ నుంచి 28 వ‌ర‌కు గూగుల్‌లో చాలామంది ఇంట్లో మ‌ద్యం త‌యారు చేయ‌డం ఎలా? అని తెగ వెతికారంట‌. దీంతోపాటు హుషారు సినిమాలో మాదిరి యూట్యూబ్‌లో కూడా మందుబాబులు వెతికారు. కొంచెం రిస్క్ ఉన్నా కొంద‌రు వెనుకంజ వేయ‌గా మ‌రికొంద‌రు కొంత ఉత్సాహంతో త‌యారీకి ప్ర‌య‌త్నాలు చేశారు. కానీ వారి ప్ర‌య‌త్నాలు విఫ‌ల‌మ‌య్యాయి. దీంతో ఇంకొన్నాళ్లు ఓపిక ప‌డ‌దామ‌ని భావించి మిన్న‌కుండిపోయారు. అయితే ఏప్రిల్ 14వ తేదీతో లాక్‌డౌన్ ముగుస్తుంది. ఆ త‌ర్వాత మందు తాగొచ్చ‌ని భావించిన వారికి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ వ‌చ్చి మే 3వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్ పొడిగిస్తున్నామ‌ని చెప్ప‌డంతో మందుబాబులు దిగాలు చెందారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావు.. మ‌ద్యం దుకాణాల విష‌య‌మై మాట్లాడితే సారీ అంటున్నారు. దీంతో మందులేక ఇంట్లో ఉండ‌లేక‌పోతున్నారు. ఎప్పుడీ ఈ లాక్‌డౌన్ ముగుస్తుందా అని ఎదురుచూస్తున్నారు.


Tags:    

Similar News