అంతరిక్షంలో అద్భుత యాత్ర పూర్తి చేసుకున్న ‘ది ఎక్స్ 37బీ’

Update: 2022-11-14 23:30 GMT
అంతరిక్ష పరిశోధనల్లో అగ్రరాజ్యం అమెరికా సత్తా చాటుతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా అమెరికా చెందిన నాసా అంతరిక్ష పరిశోధన సంస్థ తన పేరిట మరో రికార్డును నమోదు చేసుకుంది. ఇప్పటి వరకు అంతరిక్ష యాత్రలో ఒక ఆర్బిటాల్ టెస్ట్ వాహనం 780 రోజులు కక్ష్యలో గడిపిన రికార్డు ఉంది.

అయితే ఈ రికార్డును తాజాగా అమెరికాకు ‘ది ఎక్స్ 37 బీ’ ఆర్బిటల్ టెస్ట్ వెహికల్ బద్దలు కొట్టింది. ఈ వాహన నౌక అంతరిక్షంలో ఏకంగా 908 రోజులు గడిపి రికార్డు సృష్టించింది. ఈ క్రమంలోనే  ‘ది ఎక్స్ 37 బీ’ ఆర్బిటాల్ టెస్ట్ వాహన నౌక తిరిగి  ఫ్లోరిడాలోని నాసాకు చెందిన కెన్నడి స్పేస్ సెంటర్లో సురక్షితంగా ల్యాండ్ అయినట్లు అమెరికా ప్రకటించింది.

‘ది ఎక్స్ 37 బీ’ ఆర్బిటాల్ టెస్ట్ వెహికల్ ను బోయింగ్ సంస్థ అభివృద్ధి చేసింది. ఈ స్పేస్ వెహికల్ ను నాసా 2020 మే నెలలో ప్రయోగించింది. ఈ స్పేస్ వెహికల్ అంతరిక్షంలోకి వెళ్లి రావడం ఇది ఆరోసారి. మొత్తంగా ‘ది ఎక్స్ 37 బీ’ అంతరిక్షంలో 1.3 బిలియన్ల మైళ్ల దూరం ప్రయాణించినట్లు నాసా ప్రకటించింది. ఈ స్పేస్ వెహికల్ అంతరిక్షంలో 3 వేల 774 రోజులు గడిపింది.

2020 మే నెలలో అంతరిక్షంలోకి ప్రయోగించబడిన ‘ది ఎక్స్ 37 బీ’ 908 రోజులు అంతరిక్ష యాత్ర పూర్తి చేసుకుని తిరిగి భూమిపైకి సురక్షితంగా చేరుకుంది. ఈ స్పేస్ వెహికల్ ద్వారా నాసా అంతరిక్షంలో థర్మల్ కంట్రోల్ కోటింగ్స్.. ప్రింటెడ్ ఎలక్ట్రానిక్.. రేడియేషన్ షీల్డింగ్ మెటీరియల్స్.. అంతరిక్షంలోని పదార్థాల సాంకేతికత పనితీరుపై పరిశోధనలు నిర్వహించారు.

అయితే ఈ యాత్రకు సంబంధించిన కీలక విషయాలను మాత్రం స్పేస్ ఫోర్ ఇప్పటివరకు బహిర్గతం చేయకపోవడం గమనార్హం. ఏది ఏమైనా ‘ది ఎక్స్ 37 బీ’ ఆర్బిటాల్ టెస్ట్ వెహికల్ అంతరిక్షంలో సుదీర్ఘ యాత్రను పూర్తి చేసుకుని భూమిపైకి సురక్షితంగా తిరిగి రావడం అద్భుతమని సైంటిస్టులు కొనియాడుతున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News