అతి వినయం దూర్ధ లక్షణం అంటారు.. ప్రధాని నాటినా, ముఖ్యమంత్రి నాటినా మొక్క మొక్కే.. దారిన పోయే పశువుకు ఇది ముఖ్యమంత్రి మొక్క అని తినకుండా ఉంటాయా.? ఆకతాయిలకు ఇది కేసీఆర్ నాటిన ఫేవరెట్ అని తుంచకుండా ఉంటారా.? అయిన మన ప్రజాప్రతినిధులు, పోలీసులు ఆ మొక్కకు అమిత ప్రాధాన్యం ఇస్తున్నారు.
సీఎం కేసీఆర్ గతంలో నాటిన కదంబ మొక్కను ఎవరో ఆకతాయిలు మద్యం తాగి పీకేశారు. అప్పట్లో ఇది పెద్ద దుమారం రేపింది. పోలీసులు కేసు పెట్టి పలువురిని జైలుకు కూడా పంపారు. తాజాగా మూడో విడత హరితహారంలో కూడా కేసీఆర్ కరీంనగర్ దిగువ మానేరు జలాశయం పక్కన ఓ మొక్కను నాటారు. మరోసారి పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో ఈసారి నగరపాలక అధికారులు, పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. పటిష్టమైన రక్షణ ఏర్పాట్లు చేశారు. ట్రీగార్డు ఏర్పాటు సహా చుట్టూ మూడు సీసీ కెమెరాల ఏర్పాటు.. ఆ చెంతనే తాత్కాలిక గుడారం ఏర్పాటు చేశారు. ఇక అందులో పోలీసులు - కార్పొరేషన్ సిబ్బంది నిరంతరం కంటికి రెప్పలా కాపాడుతున్నారు.
ముఖ్యమంత్రి మొక్క అది.. ఆ మాత్రం ఉండాల్సిందేనని ప్రజాప్రతినిధులు స్వామిభక్తిని ప్రదర్శిస్తున్నారు. కానీ పాపం పశువులకు - సామాన్యులకే తెలియదు.. ఇది కేసీఆర్ నాటాడు.. దీన్ని పీకకూడదు అని.. ముఖ్యమంత్రి మొక్కనే కాదు ఇలా అన్ని మొక్కలను సంరక్షిస్తే ఎప్పుడూ తెలంగాణ పచ్చల హారం అయ్యేది పలువురు సెటైర్లు వేస్తున్నారు.