పాక్‌ కు పే..ద్ద డోస్ ఇవ్వాల‌న్నాడు

Update: 2017-05-02 09:55 GMT
జ‌మ్ముక‌శ్మీర్‌ లోని నియంత్ర‌ణ రేఖ వ‌ద్ద మ‌న జ‌వాన్ల‌ను అత్యంత పైశాచిక‌త్వంతో చంపేసిన పాకిస్థాన్ తీరుపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది. జ‌వాన్ల‌ను చంప‌టంతో వ‌దిలిపెట్ట‌కుండా.. వారి శ‌రీరాల్ని ముక్క‌లుముక్క‌లుగా చేయ‌టాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నారు. పాక్ సైనికుల దుర్మార్గంపైన అంత‌కు అంత బ‌దులు తీర్చుకోవాల‌నే మాట ప‌లువురి నోట వినిపిస్తోంది.

వీర సైనికుల‌కు నివాళి అర్పించేందుకు.. పాక్ మీద భారీ దాడి చేయాల‌న్న విన‌తులు వినిపిస్తున్నాయి. పాక్‌ కు గ‌ట్టిగా బుద్ధి చెప్పాల‌న్న మాట‌ను సామాన్యులే కాదు.. సెల‌బ్రిటీలు చెబుతున్నారు. వీర జ‌వానుల్ని దారుణంగా చంపిన పాక్ సైనికుల క్రూర‌త్వంపై మాజీ క్రికెట‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించారు. పాక్ తీరుపై తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసిన ఆయ‌న‌.. సైనికుల్ని ఆ తీరులో చంప‌టంపై ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

మ‌న సైనికులు చేసిన త్యాగాలు వృదా కాకూడ‌ద‌ని.. సైనికుల్ని చంపిన పాక్ కు చిన్న డోస్ స‌రిపోక‌పోతే.. పె..ద్ద డోస్ ఇచ్చి బుద్ధి చెప్పాలంటూ మండిప‌డ్డారు. గ‌తంలోనే ఇదే త‌ర‌హాలో మ‌న సైనికుల ప‌ట్ల వ్య‌వ‌హ‌రించిన పాక్‌ కు.. అందుకు త‌గ్గట్లుగా స‌మాధానం చెప్ప‌క‌పోవ‌టంతోనే.. పాక్ ఇలాంటి ప‌నుల‌కు బ‌రి తెగిస్తోంద‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News