ధోని దారుణంపై నోరువిప్పిన సెహ్వాగ్

Update: 2020-02-02 05:01 GMT
మహేంద్ర సింగ్ ధోని.. వెస్టిండీస్ లో జరిగిన ప్రపంచకప్ లో టీమిండియా తొలి రౌండ్ లోనే ఓడిపోయి వెనుదిరిగడంతో మొత్తం జట్టును ప్రక్షాళన చేశారు. భారత జట్టు కెప్టెన్ గా ధోని అనూహ్యంగా ఎంపికయ్యాడు. ఆ సమయంలో టీ20 ప్రపంచకప్ ను సాధించాడు. దీంతో భారత క్రికెట్ లో తిరుగులేని శక్తిగా అవతరించాడు.

ధోని హయాంలో టీమిండియా సీనియర్ క్రికెటర్లు గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నారనే ప్రచారం సాగింది. గంగూలీ, ద్రావిడ్, సచిన్, సెహ్వాగ్ లను సాగనంపాడనే ప్రచారం సాగింది. తాజాగా వీరేంద్ర సెహ్వాగ్ కూడా అదే విషయంపై తాజాగా సంచలన విషయం వెల్లడించారు.

2011-12 కామన్ వెల్త్ బ్యాంక్ సిరీస్ లో ధోని వ్యవహరించిన తీరు దారుణమని సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆ సిరిస్ లో తనతో ఎటువంటి సంప్రదింపులు జరపకుండానే ధోని.. తనను  జట్టు నుంచి తొలగించాడని సెహ్వాగ్ ఆరోపించాడు.

ప్రస్తుతం టీమిండియాకు ధోని వారసుడిగా ఎంపికైన పంత్ విషయంలోనూ కెప్టెన్ విరాట్ కోహ్లీ అలాగే చేస్తున్నాడని.. పంత్ గాయంతో వైదొలిగితే రాహుల్ ను కీపర్ ను చేసి అతడిని పక్కనపెట్టడం అన్యాయమన్నారు. రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉన్నప్పుడు అందరితో మాట్లాడి నిర్ణయం తీసుకున్నాడని.. కోహ్లీ మాత్రం పాత ధోనిలా వ్యవహరించాడని సంచలన వ్యాఖ్యలు చేశారు.


Tags:    

Similar News